రాష్ట్రంలో మరింత మంది తహసీల్దార్లను డిప్యూటీ కలెక్టర్లుగా అప్ గ్రేడ్ చేస్తూ KCR సర్కారు నిర్ణయం తీసుకుంది. 81 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇస్తూ ఆర్డర్స్ వెలువరించింది. ఇప్పటికే 19 మందికి ప్రమోషన్ ఇవ్వగా… ఇప్పుడు మరో 81 మందితో మొత్తం 100 మంది తహసీల్దార్ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా మారనున్నారు.