జీఎస్టీ(Good And Services Tax) ప్రవేశపెట్టిన తర్వాత ఏటికేడు వసూళ్లు భారీగా పోతుండటం భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి బాటలు పరుస్తున్నది. ఇప్పటిదాకా ఒకెత్తు.. ఇకముందు మరొకెత్తు అన్నట్లు ప్రతి సంవత్సరం అంతకంతకూ కలెక్షన్లు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం సరాసరి వసూళ్లను లెక్కిస్తే నెలకు రూ.1.66 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2017లో GST విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఆరు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి క్రమంగా కనిపిస్తూనే ఉంది.
ఏడాది క్రితం నాటి కన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో వసూళ్లు 11 శాతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా మొన్నటి ఏప్రిల్ లో ఇంచుమించు రూ.2 లక్షల కోట్లకు చేరువగా వచ్చి రూ.1.87 లక్షల దగ్గర నిలిచిపోయింది. జీఎస్టీ మండలి సిఫార్సుల మేరకు చేపట్టిన సంస్కరణల వల్లే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయని నిర్మల ప్రకటించారు.
ఆర్థిక సంవత్సరాల వారీగా వసూళ్లిలా…
ఆర్థిక సంవత్సరం | సరాసరి వసూళ్లు(రూ.ల్లో) |
2023-24 | 1.66 లక్షల కోట్లు |
2022-23 | 1.50 లక్షల కోట్లు |
2021-22 | 1.23 లక్షల కోట్లు |
2020-21 | 94,734 కోట్లు |