మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 04 Jan 2024
రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు MLC స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. MLCలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో శాసనసభ(Assembly)కి ఎన్నికయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి రాజీనామాలతో.. MLA కోటా కింద గల రెండు MLC స్థానాలు ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ప్రకటించింది. దీంతో వీటికి ఎలక్షన్స్ నిర్వహించేందుకు గాను షెడ్యూల్ రిలీజ్ చేస్తూ EC నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరు కొత్త శాసనసభ్యులు తమ పాత పదవులకు డిసెంబరు 9న రాజీనామాలు చేశారు. వీరి ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం గడువు 2027 నవంబరు 30 వరకు ఉండగా.. కడియం, కౌశిక్ రెడ్డి నాలుగేళ్ల ముందుగానే రాజీనామాలు చేసినట్లయింది.
ఈ నెల 11న ఈ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండగా, అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ నెల 29న పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ అనివార్యమైన పరిస్థితుల్లో 29 నాడు పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అనంతరం అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. శాసనసభలో పార్టీల బలాబలాల్ని బట్టి MLAల కోటా కింద ఈ MLC ఉప ఎన్నికలు జరుగుతాయి.
షెడ్యూల్ ఇలా…
11-01-2024 – నోటిఫికేషన్
11-01-2024 – నామినేషన్ల స్వీకరణ
18-01-2024 – నామినేషన్ల స్వీకరణకు తుది గడువు
19-01-2024 – నామినేషన్ల స్వీకరణ
29-01-2024 – పోలింగ్… ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు(అనివార్యమైతే)
29-01-2024 – కౌంటింగ్… సాయంత్రం 5 గంటల నుంచి
Also Read : ఎమ్మెల్సీ ఎన్నిక ఇక లాంఛనమే