Published 20 Jan 2024
భారత మార్కెట్లోకి శాంసంగ్ కొత్త ఫోన్లు వచ్చేశాయి. సరికొత్త ఏఐ టెక్నాలజీ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. S సిరీస్‌లో మొత్తం 3 వేరియంట్లను సౌత్ కొరియా టెక్ దిగ్గజం లాంచ్ చేసింది. అందులో శాంసంగ్ గెలాక్సీ S24, గెలాక్సీ S24 Plus, గెలాక్సీ S24 Ultra ఉన్నాయి. లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు గరిష్టంగా 6.8-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్ప్లేలు, 200MP రియర్ కెమెరాలతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ మూడు ఫోన్లలో Galaxy S24 Ultra మోడల్ టాప్ మోడల్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్లలో 12GB RAM, 1TB వరకు స్టోరేజీ కూడా అందిస్తున్నారు. ఈ హ్యాండ్సెట్లు Android 14-ఆధారిత One UI 6.1తో రన్ అవుతాయి. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లలో మాదిరిగా ఏడు Android OS అప్గ్రేడ్లు, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ ప్యాచ్‌లను కూడా పొందవచ్చు. కొన్ని ఫీచర్లు అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించగా, ఈ ఫీచర్లతో ఫొటోలు అత్యంత ఆకర్షణీయంగా తీసుకోవచ్చు.
ఏ ఫోన్ మోడల్ ధర ఎంతంటే? :
S24 Ultra బేస్ మోడల్ ప్రారంభ ధర రూ.1,29,999 ఉంది. 12GB + 512GB, 12GB + 1TB వేరియంట్ల ధరలు వరుసగా రూ.1,39,999, రూ.1,59,999 ఉన్నాయి. టైటానియం గ్రే, వయొలెట్, బ్లాక్ కలర్లలో ఉన్నాయి. ఆన్లైన్ కస్టమర్లు టైటానియం బ్లూ, గ్రీన్, ఆరెంజ్ కలర్లను ఎంచుకోవచ్చు. S24 సిరీస్‌లో 8GB + 256GB, 8GB + 512GB మోడల్స్ రూ.79,999, రూ.89,999 ఉండగా.. గెలాక్సీ S24 ప్లస్ మోడల్ 12GB + 256GB కాన్ఫిగరేషన్‌లో రూ.99,999కు పొందవచ్చు. అయితే, 12GB + 512GB మోడల్ ధర రూ.1,09,999 వరకు ఉంటుంది. S24 మోడల్ అంబర్ ఎల్లో, కోబాల్ట్ వైలెట్, ఒనిక్స్ బ్లాక్ లో… S24 ప్లస్ కోబాల్ట్ వైలెట్, ఓనిక్స్ బ్లాక్‌లో మాత్రమే పొందవచ్చు. ఈ ఫోన్లు సఫైర్ బ్లూ, జేడ్ గ్రీన్ రంగులలో కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ మోడల్ కలర్ ఫోన్లు ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని గమనించాలి.
Also Read: ఆ లెవెల్ నూ దాటిన జీఎస్టీ వసూళ్లు
ఇలా బుకింగ్ చేస్తే.. రూ. 22వేల విలువైన బెనిఫిట్స్ :
గెలాక్సీ S24 Ultra, Galaxy S24 ప్లస్ ఫోన్లతో రూ.22 వేల విలువైన బెనిఫిట్స్ పొందవచ్చు. మీరు 256 GB ఆప్షన్ మోడల్ ముందస్తుగా బుక్ చేసుకుంటే.. 512 GB స్టోరేజ్ ఆప్షన్‌కి ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. రూ.12వేల అప్‌గ్రేడ్ బోనస్ కూడా పొందవచ్చు. గెలాక్సీ S24 మోడల్‌పై రూ.15వేల వరకు విలువైన ప్రయోజనాలు పొందొచ్చు. ఇందులో అప్‌గ్రేడ్ బోనస్ మాత్రమే ఉంటుంది. రూ.4,999 గల వైర్లెస్ ఛార్జర్ డ్యుయోను కూడా కంపెంనీ ఉచితంగా అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్పెసిఫికేషన్లు ఇవే :
డ్యూయల్-సిమ్(నానో) S24 Ultra మోడల్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫోన్ 6.8-అంగుళాల క్వాడ్-HD+ AMOLED స్క్రీన్ తో ఉంది. క్వాడ్ కెమెరా సెటప్‌తో రాగా 200MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కి 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఇది 1TB వరకు స్టోరేజీని.. 5Gతోపాటు USB టైప్-C పోర్ట్‌ను కూడా అందిస్తుంది. 5,000mAh బ్యాటరీని, నీటి నిరోధకతకు IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. 162.3x79x8.6mmతో 233 గ్రాముల బరువు ఉంటుంది. S24, S24 ప్లస్, S24 అల్ట్రా మోడల్‌తో ఉమ్మడిగా కొన్ని స్పెసిఫికేషన్లు కలిగి ఉన్నాయి. S24, S24+ హ్యాండ్సెట్లు వరుసగా 8GB, 12GB RAMతో… 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తాయి.
Also Read: ఇక 5 లక్షల వరకు UPI పేమెంట్స్
సరసమైన ధరలో శాంసంగ్ ఫోన్లు ఇవే :
అంతేకాదు.. ఆన్లైన్లో అనేక రకాల ఆప్షన్లతో తక్కువ ధరలో శాంసంగ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.10వేల లోపు కచ్చితమైన శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవడం మీకు కష్టంగా ఉండవచ్చు. భారత మార్కెట్లో రూ.10వేల లోపు 5 బెస్ట్ శాంసంగ్ మొబైల్ ఫోన్లను ఎంచుకోవచ్చు. అందులో శాంసంగ్ (Samsung A03) ఫోన్ ధర రూ. 7,390 మాత్రమే ఉంది. అలాగే, శాంసంగ్ గెలాక్సీ M04 ఫోన్ రూ. 8,499కు కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy M02) ఫోన్ రూ. 8,999 మాత్రమే.. మరో శాంసంగ్ ఫోన్ (Samsung Galaxy F02s) ధర కేవలం రూ. 8,999 ఉండగా.. శాంసంగ్ (Samsung Galaxy A04e) ఫోన్ ధర రూ. 9,299 సొంతం చేసుకోవచ్చు.