Published 24 Dec 2023
ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే రివ్యూ చేయాల్సి ఉంటుందని, ప్రజా సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలే తప్ప అధికార హోదా చూపెట్టరాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. జిల్లాల ఉన్నతాధికారులకు సూచించారు. కలెక్టర్లు, SPలు, అడిషనల్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన CM.. వివిధ విషయాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు. ‘మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. అధికారులంతా జవాబుదారీ(Responsibility)గా పనిచేయాలి.. ఓవరాక్షన్ చేస్తే ఎంతటి వారినైనా ఇంటికి పంపే సత్తా ప్రజలకుంది.. బాధ్యతగా నడచుకుని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి.. సమన్వయం(Co-Ordination) లేకుంటే ఏ పనీ జరగదు.. పేదలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందితేనే అభివృద్ధి జరిగినట్లు’ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
గ్రామ సభల ద్వారా వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్లకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలనకు సంబంధించి జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజా సమస్యల పట్ల కింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పడు డైరెక్షన్ ఇవ్వాలని సీఎం సూచించారు.