Published 24 Dec 2023
రాష్ట్రంలో మరికొంతమంది ఐఏఎస్ లతోపాటు సీనియర్ IPS అధికారికి స్థాన చలనం కలిగింది. ఆరుగురు IASలు, ఒక IPS అధికారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్లు, SPలు, అదనపు కలెక్టర్ల(స్థానిక సంస్థల)తో ముఖ్యమంత్రి సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఈ నిర్ణయం వెలువడింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్న భారతి హోళికేరిని సాధారణ పరిపాలన శాఖ(GAD)కి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. GHMC అడిషనల్ కమిషనర్ గా ఉన్న శృతి ఓఝాను ఇంటర్ బోర్డు కార్యదర్శితోపాటు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా బాధ్యతలు కట్టబెట్టారు. రాచకొండ కమిషనర్ గా సేవలందించిన సీనియర్ IPS దేవేందర్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం వెయిటింగ్ లో ఉండగా.. ఆయన్ను సివిల్ సప్లయ్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేశారు.
అధికారి – కొత్త బాధ్యతలు
జ్యోతి బుద్ధప్రకాశ్ – కమిషనర్, రవాణాశాఖ
శృతి ఓఝా – కార్యదర్శి, ఇంటర్ బోర్డు.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
ఇ.శ్రీధర్ – కమిషనర్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్, TSIIC(FAC)
ఇ.వి.నర్సింహారెడ్డి – డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ
గౌతమ్ పొట్రు – కలెక్టర్, రంగారెడ్డి జిల్లా
భారతి హోళికేరి – రిపోర్ట్, GAD(General Administration Department)
దేవేంద్ర సింగ్ చౌహాన్(IPS) – కమిషనర్, పౌరసరఫరాలు