Published 26 Dec 2023
పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ దక్కాల్సిన ప్రయోజనాలపై దృష్టిసారించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి CM భట్టి విక్రమార్క.. ప్రధాని మోదీని కలిశారు. పెండింగ్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని కోరినట్లు ఇద్దరు నేతలు తెలిపారు. KCR ప్రభుత్వ పదేళ్ల పాలనా కాలంలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని PM దృష్టికి తీసుకెళ్లారు.
రావాల్సినవి ఇవే…
- బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పురోగతి
- కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
- ITIR ప్రాజెక్టుకు ముందడుగు
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా
- హైదరాబాద్ లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(IIM)
- సైనిక్ స్కూల్
- నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి 14 ప్రతిపాదనలు
- పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన ఫండ్స్ క్లియరెన్స్
- విద్య, వైద్య రంగాల బలోపేతానికి నిధులు
- 2015-19, 2020-21 రూ.450 కోట్ల పెండింగ్ నిధులు
- 2019-20, 2021-22, 2022-23, 2023-24కి సంబంధించిన బకాయిలు
- నాలుగేళ్ల బకాయిలు రూ.1800 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి