Published 28 Dec 2023
ఎన్నికల హామీల్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన సదస్సులతో తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన(Huge Response) కనిపించింది. పథకాల కోసం ప్రజలు బారులు తీరడంతో అన్ని సెంటర్లలోనూ విపరీతమైన తాకిడి ఏర్పడింది. ఇవాళ్టి నుంచి మొదలైన ఈ కార్యక్రమం వచ్చే నెల 6 వరకు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహ జ్యోతి సహా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. అన్ని చోట్లా సందడి నెలకొనడంతో ప్రజాపాలన సదస్సుల తొలి రోజు నాడు లక్షల సంఖ్యలో దరఖాస్తులు(Applications) వచ్చాయి. మొత్తంగా 7,46,414 అప్లికేషన్లు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. పురపాలికలు, కార్పొరేషన్లలో నిర్వహించిన సదస్సుల్లోనే 2,59,694 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు.
వచ్చిన అప్లికేషన్లు ఇలా…
రాష్ట్రవ్యాప్తంగా వచ్చినవి 7,46,414
మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో – 2,59,694
ఆరు గ్యారెంటీలకు అందినవి – 2,49,638
ఇతర పథకాలకు అందినవి – 10,056
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో – 1,98,009