Published 31 Dec 2023
ఇద్దరు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ట్రాన్స్ ఫర్ అయిన వారిలో ఇద్దరు మహిళా అధికారులే ఉన్నారు. మొన్నటి బదిలీల్లో పోస్టింగ్ దక్కక వెయిటింగ్ కే పరిమితమైన జి.చందన దీప్తి(2012 బ్యాచ్)ని తాజా బదిలీల్లో నల్గొండ SPగా నియమించారు. ఇప్పటివరకు నల్గొండ పోలీస్ బాస్ గా ఉన్న అపూర్వరావు స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు.
ఇక 2014 బ్యాచ్ కు చెందిన కె.అపూర్వరావును CID ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ SPగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.