మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 10 Jan 2024
సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను మరింత సరళీకరించేందుకంటూ తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ నుంచి బాధిత రైతుల్ని రక్షించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అధికారంలోకి రాగానే దీన్ని రద్దు(Cancel) చేస్తామని ఇంతకుముందే రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఇక ‘ధరణి’ కథేందో తేల్చడానికి ఏకంగా భూవ్యవహారాల నిపుణుల(Experts)తో కమిటీ వేశారు. ఈ కమిటీలో కన్వీనర్ తోపాటు నలుగురు సభ్యులు ఉండగా.. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని CS శాంతికుమారి విడుదల చేశారు. సీసీఎల్ఏ(Chief Commissioner Of Land Administration) నవీన్ మిట్టల్ కన్వీనర్ గా.. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి.. CCLAగా పనిచేసిన రిటైర్ట్ IAS రేమండ్ పీటర్.. నల్సాల్ వర్సిటీ ప్రొఫెసర్ సునీల్.. రిటైర్డ్ స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ బి.మధుసూదన్ సభ్యులుగా ఉంటారు.
20 లక్షల మంది బయటకు…
వీరందరికీ భూపరిపాలన వ్యవహారాల్లో విశేష అనుభవముందని గుర్తించిన సర్కారు.. కమిటీ ఏర్పాటు ద్వారా ‘ధరణి’ నుంచి సమస్యల పరిష్కారం, ‘భూమాత’ పోర్టల్ కు అంకురార్పణ చేపట్టే దిశగా సాగుతోంది. ‘ధరణి’ వల్ల అస్తవ్యస్థంగా తయారైన ఇంచుమించు 20 లక్షల మంది రైతులను బయటపడేసేందుకు ప్రభుత్వం నష్టనివారణ చర్యలు మొదలుపెట్టింది. ‘ధరణి’ పోర్టల్ లో ఇరుక్కున్న భూములను లాక్కోలేక వేలాది మంది రైతులకు కన్నీరే మిగిలింది. ఇది అత్యంత పారదర్శకమైన స్కీమ్ అని KCR సర్కారు చెప్పినా.. అది సామాన్యులను మాత్రం తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసిందనే చెప్పాలి.
‘భూమాత’కు అంకురార్పణ దిశగా…
‘ధరణి’ స్థానంలో ‘భూమాత’ పోర్టల్ ను తీసుకురానున్నట్లు కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలోనే తెలియజేశారు. అందులో భాగంగానే ‘భూమాత’ పోర్టల్ కు ఎలా రూపకల్పన చేయాలన్న దానిపై ఈ కమిటీ సూచనలు, సలహాలు ఇవ్వనుంది. 2020 అక్టోబరు 29న అమలులోకి వచ్చిన ‘ధరణి’ పోర్టల్ ను పూర్తిగా సమీక్షించి సమస్యల్ని పరిష్కరిస్తే వేలాది కర్షకుల కష్టాలకు చెల్లుచీటి పడ్డట్లే.