Published 24 Jan 2024
రెండు పార్ట్ లుగా రూపుదిద్దుకుంటున్న మూవీ ‘దేవర(Devara)’. తొలి పార్ట్(First Part)ను ఈ సంవత్సరం ఏప్రిల్ 5 విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇంతకుముందే ప్రకటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ పై సోషల్ మీడియాలో పుకార్లు(Rumours) షికార్లు చేస్తున్నాయి. జూనియర్ NTR, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుతోంది. అయితే కొన్ని కారణాల షూటింగ్ ను నిదానంగా చేయాల్సి వస్తున్నదని, కీలక నటుడు గాయపడటం కూడా దీనిపై ప్రభావం చూపిస్తోందన్న మాటలు వినపడుతున్నాయి.
గాయంతో సైఫ్ దూరం…
‘దేవర’ మూవీలో విలన్ పాత్రధారిగా చేస్తున్న బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీఖాన్.. ఈ మధ్యనే గాయాల పాలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు తిరిగి కోలుకునేందుకు సమయం పడుతుందని చెబుతున్నారు. సైఫ్ అలీఖాన్ తిరిగి సెట్స్ కు వచ్చే వరకు టైమ్ పట్టే అవకాశం ఉండటం వల్ల షూటింగ్ ఆలస్యమవుతున్నదన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ కారణాల వల్ల ముందుగా ప్రకటించిన మేరకు ‘దేవర’ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అన్న సందేహాలు నెలకొన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ‘దేవర’ టీజర్ ను ఈ నెల 8న సినిమా యూనిట్ లాంఛ్ చేసింది. ఈ టీజర్ కు అనూహ్య స్పందన(Huge Response) రావడంతో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీపడకూదన్న భావన NTRలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
‘RRR’ అంత ఘనంగా…
NTR గత సినిమా ‘RRR’ ఏ రేంజ్ లో హిట్టు కొట్టిందో చూశాం. ఆస్కార్ అవార్డుల్ని సైతం ఈ మూవీ సొంతం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘RRR’ అనుభవాల దృష్ట్యా ‘దేవర’ విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదన్న ధోరణి కనిపిస్తున్నది. అందుకే రిలీజ్ ను ఈ ఏడాది మధ్యకు వాయిదా వేసైనా సరే.. సినిమాను బాగా తీయాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే VFX వర్క్ చాలా స్పీడ్ గా సాగుతుండగా.. మరో 20 రోజులు మాత్రమే అది కంప్లీట్ కావడానికి టైమ్ ఉంది. తీరప్రాంత భూముల ఆధారంగా యాక్షన్ అండ్ డ్రామా ఎంటర్టెయినర్ గా ‘దేవర’ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ జపాన్ లోనూ జరిగిన సంగతి తెలిసిందే.