Published 24 Jan 2024
రాష్ట్రంలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. మొన్నటివరకు సింగరేణి CMD(Chairman and Managing Director)గా పనిచేసిన నడిమెట్ల శ్రీధర్ ను.. SC కులాల అభివృద్ధి శాఖకు పంపించారు. సింగరేణి సీఎండీగా బాధ్యతల నుంచి వైదొలిగిన నాటి నుంచి ఆయన వెయిటింగ్ లో ఉన్నారు. ఈయనతోపాటు మరో ఐదుగురికి పలు పోస్టుల్ని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆర్డర్స్ రిలీజ్ చేశారు.
ఐదుగురూ వెయిటింగ్ లోనే…
ఇప్పుడు ట్రాన్స్ ఫర్ అయిన వారిలో కాత్యాయనీదేవి మినహా మిగతా ఐదుగురూ పోస్టింగ్ కోసం వెయిటింగ్(Waiting)లో ఉన్నవారే. కాత్యాయనీ ఇప్పటివరకు గనులు, భూగర్భ శాఖ డైరెక్టర్ బాధ్యతలు చూస్తుండగా.. ఆమెను TSIRD సీఈవోగా స్థాన చలనం కల్పించారు. ఆమె స్థానంలో నాన్ కేడర్ కు చెందిన సుశీల్ కుమార్ ను గనులు, భూగర్భశాఖకు పంపించారు.
అధికారి – బదిలీ అయిన స్థానం
ఎన్.శ్రీధర్ – ముఖ్య కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధి శాఖ
డి.అమోయ్ కుమార్ – జాయింట్ సెక్రటరీ, పశు సంవర్ధక శాఖ
పి.కాత్యాయనీదేవి – సీఈవో, TSIRD
టి.వినయ్ కృష్ణారెడ్డి – జాయింట్ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖ
ఎస్.హరీశ్ – జాయింట్ సెక్రటరీ, రోడ్లు & భవనాల శాఖ
సుశీల్ కుమార్, డైరెక్టర్, గనుల శాఖ