
ఆధార్-పాన్ లింక్ చేసుకున్నవారు చలానా డౌన్ లోడ్ కు ఇబ్బందులు పడొద్దని ఐటీ శాఖ తెలిపింది. చలాన్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు ఎంతో మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చినందునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. చెల్లింపు పూర్తయిన తర్వాత చలాన్ కు సంబంధించిన రశీదు కాపీ పాన్ కార్డ్ హోల్డర్స్ కు చెందిన రిజిస్టర్డ్ ఈ-మెయిల్ కు వస్తుందని అంటోంది. ఒకవేళ నగదు చెల్లింపు పూర్తయినా తర్వాత కూడా ఆధార్-పాన్ లింక్ కాకపోతే అలాంటి వాటిని ఆదాయపన్ను శాఖ పరిశీలిస్తుందని స్పష్టం చేసింది.
ఆధార్-పాన్ అనుసంధానం కోసం విధించిన గడువు జూన్ 30తో ముగిసింది. అయితే లింక్ కోసం డబ్బులు చెల్లించినా… చాలా మందికి చలాన్లు డౌన్ లోడ్ కాలేదు. చలాన్లు డౌన్ లోడ్ కాకపోవడంతో అందరిలోనూ టెన్షన్ కనిపించింది. సమయానికి మనీ పే చేసినా చలాన్ రాకపోతే అందుకు తగ్గ ఆధారాలు ఎలా చూపించాలా అన్న డౌట్స్ తో ఉన్నారు. ఇలా గందరగోళం కనిపిస్తున్న పరిస్థితుల్లో ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన వివరణ… అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది.