Published 25 Jan 2024
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)కి పూర్తిస్థాయి నియామకాలు జరిగాయి. ఇప్పటికే మాజీ DGP ఎం.మహేందర్ రెడ్డిని ఛైర్మన్ గా నియమిస్తూ పంపిన ఫైల్ కు గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేయగా.. తాజాగా మరో ఐదుగురు సభ్యుల(Five Members)ను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ సభ్యులుగా నియమితులైన ఐదుగురిలో ఒకరు రిటైర్డ్ IAS ఉన్నారు. ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఇండియన్ పోలీస్ సర్వీస్(IPS) అయితే… సభ్యురాలిగా నియమితులైన అనితా రాజేంద్రన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(IAS) అధికారిగా పదవీ విరమణ పొందారు.
మరో నలుగురి నియామకాలు…
ఇండియన్ పోస్టల్ సర్వీసులో రిటైర్ అయిన అమీర్ ఉల్లాఖాన్ ను TSPSC సభ్యుడిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. అటు ప్రొఫెసర్ నర్రి యాదయ్య, యరబండి రామ్మోహన్ రావు, పాల్వాయి రజనీకుమారిలను ఇతర సభ్యులుగా నియమిస్తూ రేవంత్ రెడ్డి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.