ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని అదుపులో ఉంచుతున్న యోగి ఆదిత్యనాథ్.. ఇంటర్నేషనల్ లెవెల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వేల సంఖ్యలో వరుస ఎన్ కౌంటర్లతో రౌడీషీటర్లు, గూండాలను బెంబేలెత్తిస్తున్న ఆయన.. ఓ జర్మన్ ప్రొఫెసర్ మనసు కూడా దోచుకున్నట్లు కనపడుతోంది. ‘ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న అల్లర్లను ఆపాలంటే అక్కడకు యోగి ఆదిత్యనాథ్ ను పంపాలంటూ’ చేసిన ట్వీట్.. ఆసక్తికరంగా మారింది. ఈ ట్వీట్ జర్మనీ కార్డియాలజిస్ట్, ప్రొ.ఎన్.జాన్ కామ్ పేరిట వచ్చింది.
మరోవైపు ఈ ట్వీట్ పై యోగి ప్రభుత్వం స్పందించింది. ‘ప్రపంచంలో ఎక్కడ లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది వచ్చినా యోగిని ఫాలో అవ్వాలి.. నేరస్థులపై ఉక్కుపాదం మోపే యూపీ మోడల్ దిశగా సాగాలి’ అంటూ ట్వీట్ ద్వారా రిప్లై ఇచ్చింది. అయితే నెటిజన్లు మాత్రం అది తప్పుడు అకౌంట్ అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి యూపీ సీఎం తన మార్క్ ను చూపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటున్నారని మరికొందరు నెటిజన్లు అంటున్నారు.