Published 29 Jan 2024
ప్రముఖ ఆపిల్ కంపెనీ లేటెస్ట్ ఐఫోన్ల(Apple iPhones)పై ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యే ఆఫర్లను అందిస్తోంది. ప్రత్యేకించి ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.66,999 ధరకు ఐఫోన్ 15 సిరీస్ అందుబాటులో ఉంది. గత 2023 సెప్టెంబరులో లాంచ్ అయిన ఈ ఐఫోన్ 15 మోడల్ అసలు ధర రూ.79,900. ధర గణనీయంగా తగ్గడంతో ఈ ఫోన్ కొనుగోలుపై మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. మీ పాత ఐఫోన్ లేదా ఏదైనా అర్హత ఉన్న ఫోన్‌పై ట్రేడింగ్ చేసేందుకు అనేక బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ధర :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 మోడల్ 128GB రూ.66,999 తగ్గింపు ధరతో అందిస్తోంది. ఈ మోడల్ అసలు ధర నుంచి గణనీయమైన రూ.13,000 తగ్గింపును అందిస్తోంది. అదేవిధంగా, 256GB, 512GB మోడల్‌లు రూ.76,999, రూ.96,999 ధరలకు అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ఆఫర్లు :
బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ల ద్వారా మీ సేవింగ్స్ ఆదా చేసుకోనే అవకాశం ఉంది. మీరు బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేయాలనుకుంటే.. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.2,000 తగ్గింపును పొందవచ్చు. అంటే మీరు రూ.54,990 దాకా తగ్గింపును పొందవచ్చు.
అదనంగా, నో-కాస్ట్ EMI ప్లాన్లు, UPI డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, iPhone 15 కోసం మీ iPhone 14 Pro Maxని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.46,149 తగ్గింపు పొందవచ్చు. మీరు iPhone 12 వంటి పాత మోడల్‌పై ట్రేడ్-ఇన్ ఆప్షన్ ద్వారా రూ.20,850 తగ్గింపును పొందవచ్చు.
iPhone 15 కలర్ ఆప్షన్లు ఇవే :
ఐఫోన్ 15 మొత్తం 5 ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. అందులో పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ ఉన్నాయి. ప్రతి మోడల్‌కు రంగుల లభ్యత మారవచ్చు. రంగుల లభ్యత ఆధారంగా ధరలు మారవచ్చని గమనించాలి.
ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే :
డిజైన్ – డిస్ప్లే : ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 6.1-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 14 మోడల్ గత వెర్షన్ల మాదిరిగానే అదే డిజైన్ కలిగి ఉంది. గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మోడళ్లలో లాంచ్ చేసిన సమయంలో డైనమిక్ ఐలాండ్ నాచ్, సాంప్రదాయ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంది. కొత్త 48MP ప్రధాన కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14 మోడల్ కూడా 12MP డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 15 మెరుగైన కెమెరా తక్కువ-కాంతిలో ఫోటోగ్రఫీని అందిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఆపిల్ ప్రకారం, ఐఫోన్ 15లో ‘ఆల్-డే బ్యాటరీ’ అందిస్తుంది. ఒకే ఛార్జ్‌పై రోజంతా వస్తుంది.
ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 15 వేగవంతమైన ప్రాసెసర్‌తో వస్తుంది. A16 బయోనిక్, ఐఫోన్ 14 మోడల్, ఐఫోన్ 14 ప్లస్‌లకు భిన్నంగా A15 బయోనిక్ చిప్‌ను కలిగి ఉంది. A16 చిప్ మునపటి ఫోన్ మాదిరిగా A15 కన్నా ఎక్కువ సామర్థ్యంతో వేగవంతమైనది. డైనమిక్ ఐలాండ్ గతంలో ఐఫోన్ 14 ప్రో మోడల్లకు పరిమితం అయింది. USB టైప్ C ఛార్జింగ్ ద్వారా ఐఫోన్ 15 ఇప్పుడు USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంది. ప్రత్యేకమైన ఐఫోన్ ఛార్జర్ల అవసరాన్ని తొలగిస్తుంది.
ఐఫోన్ 14 ధరపై 15శాతం తగ్గింపు :
ఫ్లిప్ కార్ట్‌లో మరో ఐఫోన్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 14 మోడల్ గత సెప్టెంబర్ 2022లో లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో 15 శాతం తగ్గింపు తర్వాత రూ.58,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, PNB క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. ఆపిల్ ఐఫోన్ 14లో ఇంటర్నల్ A15 బయోనిక్ చిప్సెట్ ఉంది. దీనిని 128GB, 256GB, 256GB స్టోరేజీతో ఆప్షన్లతో వస్తుంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ రెండు మోడల్ ఐఫోన్లపై భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.