Published 29 Jan 2024
అసలే తొలి టెస్టు(First Test)లో ఓటమి మూటగట్టుకున్న భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఫస్ట్ టెస్ట్ లో రాణించిన ఇద్దరు ప్లేయర్లే రెండో టెస్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఆ ఇద్దరు కీలక ఆటగాళ్లే కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా. గాయాలతో వీరిరువురు వచ్చే నెల 2 నుంచి విశాఖపట్నంలో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. జడేజా తొలి ఇన్నింగ్స్ లో 87, రెండో ఇన్నింగ్స్ లో 2 పరుగులు చేయడమే కాకుండా.. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి మొత్తం 5 వికెట్లు తీసుకున్నాడు. ఇక రాహుల్ సైతం ఫస్ట్ ఇన్నింగ్స్ లో 86 రన్స్ చేయడంతో టీమిండియా(TeamIndia)కు ఆధిక్యం లభించింది. ఇలాంటి ముఖ్యమైన ప్లేయర్లు ఛాలెంజింగ్ గా మారిన సెకండ్ టెస్టుకు అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా తయారైంది.
కొత్త కుర్రాళ్లకు ఛాన్స్…
మరో ముగ్గురు ప్లేయర్లను భారత జట్టుకు సెలెక్ట్ చేస్తే అందులో ఇద్దరు కొత్త కుర్రాళ్లు(Youngsters) ఉన్నారు. దేశవాళీలో టన్నుల కొద్ది పరుగులు సాధిస్తూ జాతీయ జట్టు ఎంట్రీ(Entry) కోసం ఏళ్లుగా తపిస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్.. ఎట్టకేలకు సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇతడితోపాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ జాతీయ జట్టు తలుపు తట్టారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సౌరభ్ ఫస్ట్ క్లాక్ క్రికెట్ లో 290 వికెట్లు తీసుకున్నాడు. ఇంతకుముందు ఇతడు బంగ్లాదేశ్ టూర్ కు కూడా ఎంపికయ్యాడు.
సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం…
అత్యంత ప్రతిభావంతుడైన సర్ఫరాజ్ ఖాన్ కు జట్టులో బెర్త్ దక్కకపోవడంతో అన్ని వర్గాల నుంచి కొన్నాళ్లుగా పెద్దయెత్తున విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో గత కొద్దికాలంలోvs 45 మ్యాచ్ ల్లో 69.85 యావరేజ్ తో 14 సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు రాహుల్, జడేజా లేకపోవడంతో సెకండ్ మ్యాచ్ లో సర్ఫరాజ్ కు చోటు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. 17 ఏళ్ల 177 రోజుల వయసులోనే 2015 IPLల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంపికైన నాలుగో అత్యంత పిన్న వయస్కుడిగా సర్ఫరాజ్ నిలిచాడు.