OnePlus 12 Phones Launch : భారత మార్కెట్లోకి రెండు సరికొత్త వన్‌ప్లస్ ఫోన్లు ఈ మధ్యనే లాంచ్ అయ్యాయి. అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఈ మొబైళ్లు ఉన్నాయి. OnePlus 12, OnePlus 12R మోడళ్లు అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లు, స్పెషిఫికేషన్లతో వచ్చాయి. వన్‌ప్లస్ గ్లోబల్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ భారత మార్కెట్లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లను రిలీజ్ చేసింది. అయితే, Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌తో కూడిన మొదటి ఫ్లాగ్షిప్ ఫోన్‌గా OnePlus 12 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. సోనీ LYT-808 సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 64MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. OnePlus 12R ఫోన్ ను కూడా కంపెనీ లాంచ్ చేయగా.. గతంలో చైనాలో లాంచ్ అయిన OnePlus Ace 3 రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెండు స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఆక్సిజన్OS14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతాయి.
భారత్‌లో వన్‌ప్లస్ 12, OnePlus 12R ధర లభ్యత :
భారత మార్కెట్లో OnePlus 12 ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ప్రారంభ ధర రూ.64,999 ఉంటుంది. 16GB+512GB మోడల్ ధర రూ. 69,999 ఉంటుంది. ఈ ఫోన్ ఫ్లోవీ ఎమరాల్డ్, సిల్కీ బ్లాక్ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ వెబ్సైట్, అమెజాన్, రిటైల్ స్టోర్ల ద్వారా ఈ హ్యాండ్సెట్ విక్రయాలు జనవరి 30 నుంచి ప్రారంభమయ్యాయి. మరోవైపు, OnePlus 12R బేస్ 8GB+128GB RAM స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ.39,999గా నిర్ణయించింది. వేగవంతమైన స్టోరేజీతో 16GB+256GB మోడల్ని కూడా రూ.45,999కు అందిస్తోంది. ఈ హ్యాండ్సెట్ కూల్ బ్లూ, ఐరన్ గ్రే కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఫిబ్రవరి 6న వన్‌ప్లస్ వెబ్సైట్, అమెజాన్, రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది.
OnePlus 12 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 12 డ్యూయల్ సిమ్(నానో) ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్OS 14పై నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.82-అంగుళాల క్వాడ్-HD+ (1,440 x 3,168 పిక్సెల్‌లు) LTPO 4.0 AMOLED స్క్రీన్‌తో గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కలిగి ఉంది. వన్‌ప్లస్ ప్రకారం.. డిస్ప్లే గరిష్ఠ ప్రకాశం 4,500 నిట్లను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 1Hz, 120Hz మధ్య ఉంటుంది. Qualcomm ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో నడుస్తుంది. గరిష్టంగా 16GB వరకు LPDDR5x RAM, 512GB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సోనీ LYT-808 సెన్సార్, f/1.6 ఎపర్చర్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 114-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 64MP పెరిస్కోప్ టెలిఫోటోను కలిగి ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్, 32MP సెల్ఫీ కెమెరాను f/2.4 ఎపర్చర్‌తో కలిగి ఉంది, డిస్ప్లేపై హోల్-పంచ్ కటౌట్లో ఉంది.
వన్‌ప్లస్ 12 5G ఫోన్ 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, NFC కనెక్టివిటీని అందిస్తుంది. గైరోస్కోప్, యాక్సిలరోమీటర్, మాగ్నెటోమీటర్, బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. SuperVOOC ఛార్జర్‌ని ఉపయోగించి 100W వద్ద ఛార్జ్ చేయగల 5,400mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ 50W వైర్లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. IP65 రేటింగ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, 164.3×75.8×9.15mm పరిమాణం, 220 గ్రాముల బరువు ఉంటుంది.
OnePlus 12R స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ మరో కొత్త మోడల్ OnePlus 12R కూడా ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఆక్సిజన్OS 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో నడుస్తుంది. కొద్దిగా చిన్న 6.78-అంగుళాల 1.5K (1,264×2,780 పిక్సెల్‌లు) LTPO 4.0 AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్, డిస్ప్లే ప్రొటెక్షన్ మెటీరియల్ రెండు ఫోన్ల ఇతర స్పెసిఫికేషన్లు ఒకే విధంగా ఉంటాయి. మునుపటి జనరేషన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌తో పనిచేస్తుంది. గత ఏడాదిలో OnePlus 11కి కూడా ఇదే ప్రాసెసర్ అందించింది. ఈ ఫోన్ గరిష్టంగా 16GB వరకు LPDDR5x RAMతో పనిచేస్తుంది. వన్‌ప్లస్ 12R సోనీ IMX890 సెన్సార్, f/1.8 ఎపర్చర్‌తో కూడిన 50MP కెమెరా, 112-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్లో 16MP సెల్ఫీ కెమెరా f/2.4 ఎపర్చర్‌తో ఉంది.
మీరు వన్‌ప్లస్ 12Rలో 128GB UFS 3.1 స్టోరేజ్ లేదా 256GB UFS 4.0 స్టోరేజ్ పొందుతారు. ఈ హ్యాండ్‌సెట్‌లోని బ్లూటూత్ 5.3 మినహా కనెక్టివిటీ ఆప్షన్లు, సెన్సార్లు ఫ్లాగ్షిప్ ఫోన్ల మాదిరిగానే ఉంటాయి. ఈ 12R ఫోన్లో కొంచెం పెద్ద 5,000mAh బ్యాటరీని ఉంటుంది. 100W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదని గమనించాలి. ఈ ఫోన్ కొలతలు 163.3×75.3×8.8mm ఉండగా.. 207గ్రాముల బరువు ఉంటుంది.