తెలుగు సినీ ఇండస్ట్రీ(Telugu Industry)యే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్ రాజమౌళికి, సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజే వేరు. బాహుబలి, ఆర్ఆర్ఆర్(RRR)తో రాజమౌళి.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇంటర్నేషనల్(Worldwide) లెవెల్లో గుర్తింపు తీసుకొచ్చారు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ఎంతటి ఆసక్తి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అటు ‘గుంటూరు కారం’ తర్వాత మహేశ్ బాబు.. రాజమౌళితో సినిమా(Movie)కు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చినట్టు తెలుస్తోంది.
సూపర్ స్టార్‌తో జక్కన్న మూవీ అన్న అనౌన్స్ మెంట్(Announcement) వచ్చినపుడే ఈ సినిమాపై బజ్(Buzz) క్రియేట్ అయింది. అప్పట్నుంచి ఒక్కో అప్డేట్ రిలీజ్ చేస్తూ జక్కన్న టీమ్.. సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నది. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీలో మహేశ్ కౌబాయ్‌లా నటిస్తారని కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్యూలో చెప్పారు. దీంతో సౌత్ ఆడియన్స్(Audiance) మాత్రమే కాదు.. బీటౌన్ ఆడియన్స్ కూడా ఈ కాంబో మూవీ ఎప్పుడు తెరపైకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.
సీనియర్ హీరో పాత్రపైనా…
అయితే ఇప్పుడు మరో ఇంట్రిస్టింగ్ న్యూస్ జక్కన్న కాంపౌండ్ నుంచి బయటకు వచ్చింది. టాలీవుడ్(Tollywood) మరో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో ఉంటారని విజయేంద్రప్రసాద్ ప్రకటించారు. ఆ హీరో ఎవరా అనేది సస్పెన్స్ గా మారిన పరిస్థితుల్లో ఇక ఆ హీరో ఎవరో కాదు.. కింగ్ నాగార్జున అని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తోంది. రాజమౌళి సినిమాలంటే చాలా క్యారెక్టర్స్ తయారవగా.. ప్రతీ క్యారక్టర్ కు మంచి ప్రయారిటీయే ఉంటుంది. అలాంటి పాత్రలో నాగార్జునను చూపెడతారని మహేశ్-రాజమౌళి అభిమానులు అనుకుంటున్నారు.
మంచి రిలేషన్ షిప్…
నాగార్జున అయితే తమ సినిమాకు ప్లస్ అవుతుందని రాజమౌళి అనుకుంటున్నారట. బాలీవుడ్(Bollywood)లో నాగార్జునకు మంచి పరిచయాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ కింగ్ ‘బ్రహ్మాస్త్ర’ సిరీస్ లో ‘కీ రోల్’ ప్లే చేశారు. సో నాగార్జున యాక్టింగ్ తో ఈ మూవీని హిందీ ఆడియన్స్ లోకి తీసుకెళ్లొచ్చనే ఆలోచనలో కెప్టెన్ ఉన్నారని టాక్ నడుస్తోంది. ‘రాజన్న’ సినిమాలో కీలక ఎపిసోడ్స్ కోసం రాజమౌళి చేయూతనందించారు. అలా రాజమౌళి, నాగార్జున మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది. కాబట్టి మహేశ్ సినిమాలో నాగార్జునను జక్కన్న ఎలాగైనా ఒప్పిస్తారని చర్చ సాగుతున్నది. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలంటే కొన్నాళ్లు వేచిచూడక తప్పదేమో.
Published 01 Feb 2024