అతి చిన్న వయసులోనే(Young Age) భారత క్రికెట్ పై చెరగని ముద్ర వేసిన ఘనత ఆ కుర్రాడిది. ధోనిని మరిపించేలా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడటంలో నంబర్ వన్ గా నిలిచే ఘనత అతడి సొంతం. బ్యాట్ పట్టాక(Batting) రన్స్ ఎలా తీయాలో తప్ప ఎదురుగా ఎవరున్నారది కాదు అతడికి కావాల్సింది. అంతలా వీరవిహారం చేసే ఆ యువ విధ్వంసమే రిషభ్ పంత్(Rishabh Pant). రోడ్డు యాక్సిడెంట్ లో త్రుటిలో ప్రాణాల నుంచి తప్పించుకున్న పంత్.. ఏడాది కాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. BCCI ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుండగా.. 2024 IPLలో పునరాగమనం(Re-Entry) చేస్తాడా అన్నది క్వశ్చన్ మార్క్ గా తయారైంది.
టైమ్ ముగిసిందనుకున్నా…
‘యాక్సిడెంట్ నుంచి తీవ్రమైన గాయాలతో బయటపడ్డా.. అప్పుడే ఇక ఈ భూమిపై టైమ్ అయిపోయిందనుకున్నా.. జీవితంలో అలాంటి ఆలోచన రావడం అదే మొదటిసారి.. నా చరిత్ర ముగిసిందనుకున్న సమయంలోనే పునర్జన్మ లభించింది’.. అంటూ పంత్ చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. ఇన్సిడెంట్ జరిగిన 8 నెలలకు 2023 ఆగస్టు 24న ఓ నేషనల్ ఛానల్ కు రిషభ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. కుటుంబంతో గడిపేందుకు 2022 డిసెంబరు 30న ఢిల్లీ నుంచి రూర్కీ బయల్దేరిన పంత్ కారు.. డివైడర్(Devider)ను ఢీకొట్టి ఘోర ప్రమాదం(Accident) జరిగిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల ఈ కుర్రోడు ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి వచ్చి ఏడేళ్లయింది. 2022 డిసెంబరులో బంగ్లాదేశ్ తో ఆడిన టెస్టు మ్యాచే అతడికి చివరిది.
డాక్టర్ల సలహా మేరకే…
రజత్ కుమార్, నిషు కుమార్ అనే వ్యక్తుల వల్ల ప్రాణాలతో బయటపడ్డానని ప్రమాదానికి గురైన SUV నుంచి తనను బయటకు తీసిన విషయాన్ని మననం చేసుకున్నాడు. ‘నేను ఇంకా క్రికెట్ ఆడాల్సి ఉంది.. కానీ దానికి కచ్చితమైన ప్లాన్ అంటూ ఏమీ లేదు.. నేను కోలుకోవడానికి ఇంకా ఎంత టైమ్ పడుతుందని డాక్టర్లను అడుగుతూనే ఉన్నా.. కానీ ఎవరూ పెద్దగా క్లారిటీ ఇవ్వడం లేదు.. కనీసం 16 నుంచి 18 నెలలు పడుతుందని మాత్రమే చెబుతున్నారు’.. అని పంత్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.
Published 01 Feb 2024