పేటీఎం బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఆర్బీఐ(Reserve Bank Of India) ఆంక్షలు విధించింది. Paytm పేమెంట్స్ బ్యాంక్(PPBL)కి వ్యతిరేకంగా RBI చర్యలు తీసుకుంది. సిస్టమ్ ఆడిట్ తర్వాత ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించిన రిజర్వ్ బ్యాంకు.. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై నిషేధం విధించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో కస్టమర్లు అకౌంట్ బయటి బ్యాంక్‌తో లింక్ అయినంత వరకు డిజిటల్ పేమెంట్ల కోసం పేటీఎం ఉపయోగించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంకు ప్రకారం.. ‘ఫిబ్రవరి 29, 2024 తర్వాత కాకుండా కస్టమర్ల అకౌంట్లు, ప్రీపెయిడ్ టూల్స్, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, NCMC కార్డ్‌లు మొదలైన వాటిలో తదుపరి డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్లు అనుమతించబడవు. మీకు పేమెంట్ బ్యాంకు ద్వారా చేసిన పేమెంట్లపై ఏవైనా వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు లేదా రీఫండ్లు ఈ నెల 29 తర్వాత ఎప్పుడైనా క్రెడిట్ అవ్వొచ్చు. వినియోగదారులు సొంతంగా పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్‌ని కలిగి ఉంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫాస్ట్‌ట్యాగ్ అంటే ఏమిటి? :
అన్ని ఫోర్-వీలర్ వాహనాల విండ్షీల్డ్పై ఫాస్ట్‌ట్యాగ్ కలిగి ఉండటం తప్పనిసరి. ఫాస్ట్‌ట్యాగ్ అనేది భారతీయ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇది (NHAI) ద్వారా పనిచేస్తుంది. ప్రీపెయిడ్ వాలెట్లను ఉపయోగించి టోల్ బూత్‌లలో చెల్లింపులు చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికతను ఉపయోగిస్తుంది.
ఫిబ్రవరి 29 తర్వాత మీ పేటీఎం FASTag ఏమవుతుంది? :
Paytm ఫాస్ట్‌ట్యాగ్ కస్టమర్లు తమ బ్యాలెన్స్‌లను వినియోగించుకునేందుకు RBI అనుమతించింది. అయితే మార్చి 1 నుంచి అధిక మొత్తంలో పేటీఎం వ్యాలెట్‌లో డబ్బును లోడ్ చేయలేరని గమనించాలి.
మీ Paytm ఫాస్ట్‌ట్యాగ్‌ని డీయాక్టివేట్ చేయడం ఎలా? :
1) మీ మొబైల్ డివైజ్‌లో Paytm యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికే ఉన్న మీ వివరాల ద్వారా లాగిన్ చేయండి.
2) సెర్చ్ బార్లో ‘ఫాస్ట్ ట్యాగ్’ అని టైప్ చేసి ఆపై ‘Services’ సెక్షన్ కింద ‘Manage FASTag’పై నొక్కండి
3) మీ Paytm నంబర్‌కి లింక్ చేసిన అన్ని యాక్టివ్ FASTag అకౌంట్లనుప్రదర్శించే స్క్రీన్‌కి రీడైరెక్ట్ అవుతారు.
4) పేజీ దిగువకు నావిగేట్ చేసి ‘Help & Support’పై క్లిక్ చేయండి
5) ఇప్పుడు ‘Need help with non-order related queries’పై నొక్కండి. ‘FASTag ప్రొఫైల్ అప్డేట్ సంబంధించిన ప్రశ్నల ఆప్షన్ ఎంచుకోండి.
6) మీరు ఇప్పుడు ‘నేను నా ఫాస్ట్‌ట్యాగ్‌ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను’ అనే ఎంపికను ఎంచుకోవాలి. దానిపై క్లిక్ చేసి, తదుపరి దశలను అనుసరించండి.
ఫిబ్రవరి 29 తర్వాత బ్యాంక్ ఫండ్ బదిలీలు (AEPS, IMPS మొదలైన సర్వీసులతో సంబంధం లేకుండా) బిల్లు చెల్లింపులు లేదా యూపీఐ సౌకర్యాలు వంటి ఇతర సర్వీసులను అందించకూడదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. Paytm సేవలను ఉపయోగించి ఎలాంటి నగదు బదిలీ లేదా బిల్లు చెల్లింపులు లేదా యూపీఐ లావాదేవీలు చేయలేరు.
ఇతర బ్యాంకులకు మాత్రమే అనుమతి :
ఆర్బీఐ నిబంధన ప్రకారం.. పేటీఎం ప్లాట్ఫామ్లో అకౌంట్ క్రియేట్ చేయలేరు. కొత్త వినియోగదారులను అనుమతించకపోవచ్చు. వినియోగదారులందరి పేటీఎం వ్యాలెట్లు ప్రభావితమవుతాయి. పేటీఎం ఫాస్టాగ్‌లు మొబిలిటీ కార్డ్‌లు కూడా ప్రభావితమవుతాయి. ఫిబ్రవరి 1న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కూడా దీనిపై స్పందించింది. PPBL… RBI ఆదేశాలకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకుంటోంది. పేటీఎం సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ఆర్బీఐతో కలిసి పనిచేస్తున్నట్టు పేర్కొంది. One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) ఇతర బ్యాంకులతో మాత్రమే పని చేస్తుందని, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో పనిచేయడం మానేస్తుందని కంపెనీ ప్రకటించింది.
ఆఫ్‌లైన్ మర్చంట్ పేటీఎం సర్వీసులకు అనుమతి :
ప్రస్తుత పేటీఎం యూజర్లు తమ ప్లాట్‌ఫారమ్‌ల చెల్లింపుల పరిష్కారాలను ఉపయోగించడం కొనసాగిస్తారు. ఆఫ్‌లైన్ సర్వీసులు ఫిబ్రవరి 29 తర్వాత అందుబాటులో ఉంటాయి. పేటీఎం పేమెంట్ గేట్‌వే మర్చంట్ (ఆన్లైన్ వ్యాపారులు)కు అందించడం కొనసాగుతుంది. OCL ద్వారా Paytm QR, Paytm సౌండ్‌బాక్స్, Paytm కార్డ్ మెషిన్ వంటి ఆఫ్‌లైన్ మర్చంట్ పేమెంట్ నెట్వర్క్ ఆఫర్లు యథావిధిగా కొనసాగుతాయి. ఇక్కడ కొత్తఆఫ్లైన్ మర్చంట్లను కూడా చేర్చుకోవచ్చునని పత్రికా ప్రకటనలో పేటీఎం తెలిపింది.