FASTag KYC Update deadline extended : మీకు వాహనం ఉందా? ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ వాడుతున్నారా? అయితే, మీ అకౌంట్ కేవైసీ పూర్తి చేయలేదా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఫాస్ట్‌ట్యాగ్‌లలో నో యువర్ కస్టమర్(KYC)ని అప్డేట్ చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మరింత గడువును పొడిగించింది. ఇప్పటివరకూ జనవరి 31 వరకు మాత్రమే గడువు విధించగా. తాజాగా ఫిబ్రవరి 29 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త గడువులోగా.. ఇప్పటివరకూ కేవైసీ పూర్తి చేసుకుని వినియోగదారులు వెంటనే పూర్తి చేసుకోవాల్సిందిగా కోరింది.
RBI మార్గదర్శకాలతో…
ఆటోమేటిక్ టోల్ వసూలు, టోల్ ప్లాజాల వద్ద లాంగ్ క్యూలను నివారించడానికి ఫిబ్రవరి 15, 2021 నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి టోల్ ప్లాజాల వద్ద ఎన్హెచ్ఏఐ ‘ఒక వాహనం.. ఒకే ఫాస్ట్‌ట్యాగ్’ క్యాంపెయిన్ ప్రారంభించింది. మల్టీ వెహికిల్స్ లేదా అనేక ఫాస్ట్‌ట్యాగ్‌లను కనెక్ట్ చేయడమే లక్ష్యంగా ఇది అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్బీఐ మార్గదర్శకాల(Guidelines) నేపథ్యంలో NHAI ఫాస్ట్ ట్యాగ్ (One Vehicle One FASTag) గడువు తేదీని పెంచుతూ ఒక ప్రకటనలో వెల్లడించింది. మీ లేటెస్ట్ FASTag కోసం KYC అప్డేషన్ను పూర్తి చేయడానికి ఈ నెల 29 వరకు పొడిగించింది.
8 కోట్ల మంది…
ఏజెన్సీ ప్రకారం.. జనవరి 31 గడువు కన్నా ముందు భారత్ అంతటా జారీ చేసిన 1.27 కోట్లలో కేవలం 7 లక్షల మల్టీ ఫాస్ట్‌ట్యాగ్‌లు నిలిచిపోయాయి. తదుపరి గడువు ముగిసేలోపు మిగిలిన FASTag అకౌంట్లు పనిచేయవని NHAI భావిస్తోంది. ప్రస్తుతం ఫాస్ట్‌ట్యాగ్‌కు ఎనిమిది కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు.
FASTag అకౌంట్లలో KYCని ఎలా అప్డేట్ చేయాలి? ఎలా స్టేటస్‌ని చెక్ చేయాలంటే? :
FASTag కేవైసీ స్టేటస్ ఇలా చెక్ చేయండి :
ముందుగా, మీ లేటెస్ట్ ఫాస్ట్‌ట్యాగ్ KYC స్టేటస్ చెక్ చేయండి. ఇందుకోసం https://fastag.ihmcl.comలో కస్టమర్ వెబ్ పోర్టల్‌ని సందర్శించండి. ఆపై రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్వర్డ్ ఉపయోగించి మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. మీరు ధ్రువీకరణ కోసం OTPని కూడా ఉపయోగించవచ్చు. లాగిన్ అయిన తర్వాత డాష్‌బోర్డ్‌కి నావిగేట్ చేసి, ‘మై ప్రొఫైల్’ ఎంపికను ఎంచుకోండి. ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో సమర్పించిన అన్ని వివరాలను మీకు డిస్ప్లే చేస్తుంది.
కేవైసీని అప్డేట్ చేయకపోతే :
లేటెస్ట్ FASTag కోసం KYC అప్డేట్ చేయకపోతే.. ‘మై ప్రొఫైల్’ విభాగంలో KYC విభాగాన్ని గుర్తించండి. కేవైసీ సెక్షన్ క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ టైప్ ఎంచుకోమని ప్రాంప్ట్ కనిపిస్తుంది. అవసరమైన ID ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లతో మ్యాండేటరీ ఫీల్డ్‌లను నింపండి. అదనంగా, రుజువుగా పాస్‌పోర్ట్ సైజు ఫోటో, అడ్రస్ వివరాలను అప్లోడ్ చేయండి. ఈ వివరాలను సమర్పించే ముందు, మీరు డాక్యుమెంట్లు, సమాచారం అథెంటికేషన్ సెల్ఫ్-డిక్లరేషన్ బాక్స్‌లో టిక్ చేయాలి. ఇప్పుడు మీ KYC వివరాలను సమర్పించండి.
ఏ డాక్యుమెంట్లు అవసరమంటే? :
మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC)
పాస్‌పోర్టు సైజు ఫోటో
వాహన లైసెన్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్
సంబంధిన వాహనం
పైన పేర్కొన్న ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్
కేవైసీ ఇలా పూర్తి చేయండి :
బ్యాంక్‌కి లింక్ చేసిన FASTag వెబ్‌సైట్‌కి వెళ్లండి
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ని ఉపయోగించి లాగిన్ చేయండి
మొబైల్లో వచ్చిన OTPని ఎంటర్ చేయండి
మై ప్రొఫైల్‌కి వెళ్లి KYC ట్యాబ్‌పై క్లిక్ చేయండి
అడ్రస్, ఇతర అవసరమైన సమాచారాన్ని నింపండి
KYC ప్రాసెస్ పూర్తవుతుంది