అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో(Challenging Situations) క్రీజులో ఎలా పాతుకుపోవాలో నిరూపించాడు.. ఫేమస్ గా ముద్రపడ్డ బ్యాటర్లకే సాధ్యం కాని ఇన్నింగ్స్ ఆడుతూ ఔరా అనిపించాడు. ఆడింది అతి తక్కువ మ్యాచ్ లే అయినా.. ఆటంటే ఇలాగే ఆడాలని నిరూపించాడు యశస్వి జైస్వాల్. అత్యంత సీనియర్ అయిన రోహిత్ శర్మ సొంతగడ్డపైనే బ్యాటింగ్ కు కష్టాలు పడుతుంటే.. ఈ కుర్రాడు మాత్రం అలవోకగా భారీ ఇన్నింగ్స్ ఆడేస్తున్నాడు. రోహిత్ కు పూర్తి భిన్నమైన ఆటను ఆడుతూ సంచలన ఓపెనర్ గా దూసుకుపోతున్నాడు. ఫోర్లు, సిక్స్ లు కొట్టడం అంత ఈజీ(Easy)నా అన్న రీతిలో ప్రత్యర్థి టీమ్ ల బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. అది పొట్టి ఫార్మాటా, వన్డేనా, టెస్టా అన్నది కాదు.. అన్నింట్లోనూ భారీగా పరుగులు చేస్తున్నామా లేదా అన్నదే ప్రాధాన్యంగా మారిపోయింది జైస్వాల్ కి.
విశాఖ టెస్టులో విజృంభణ…
ఇంగ్లండ్ తో విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ ఆటతీరు అదరహో అన్నట్లు సాగింది. ఒక ఎండ్ లో క్రమం తప్పకుండా(Continue)గా వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్ లో యశస్వి(179 నాటౌట్; 257 బంతుల్లో, 17×4, 5×6) వికెట్ తీయడం ఇంగ్లిష్ బౌలర్లకు గగనమైపోయింది. తొలి రోజు ఆట మొత్తాన్ని 22 ఏళ్ల ఈ ఉత్తరప్రదేశ్ చిన్నోడు శాసించాడంటే(Dominate) ఆశ్చర్యం లేదనాలి. రోహిత్(14), గిల్(34), శ్రేయస్(27), రజత్ పటీదార్(3), అక్షర్ పటేల్(27), భరత్(17) వికెట్లు పడ్డా.. ఈ యంగ్ ఓపెనర్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తొలిరోజు ఆటలోనే టీమ్ఇండియా 300కు పైగా పరుగులు చేసిందంటే అదంతా ఈ చిన్నోడి చలవేనని చెప్పక తప్పదు.
ఆట ముగిసే సమయానికి
తొలిరోజు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. జైస్వాల్ మాత్రం డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్ చెరో రెండు వికెట్లు… జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్ లీ చెరో వికెట్ చొప్పున తీసుకున్నారు.
Published 02 Feb 2024