Paytm Users Fear : పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సర్వీసులు ఈ నెల 29 నుంచి పనిచేయవని భారత రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. ఫిన్‌టెక్ సంస్థకు భారీ దెబ్బతో కొత్త డిపాజిట్లను స్వీకరించడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ ప్రకటించడంతో అనేక మందిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేటీఎం(Paytm) సర్వీసులు పూర్తిగా నిలిచిపోతాయా? లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఫిబ్రవరి 29 తర్వాత ఏం చేయాలనే ఆందోళన పేటీఎం యూజర్లలో కనిపిస్తున్నది. యూజర్ల భయాందోళనను పొగొట్టేందుకు పేటీఎం వ్యవస్థాపకుడు(Founder), సీఈవో అయిన విజయ్ శేఖర్ శర్మ శుక్రవారం రంగంలోకి దిగారు. వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత పేటీఎం యథావిధిగా పనిచేస్తుంది :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(Bank) వ్యాపార కార్యకలాపాల(Transaction)ను పరిమితం చేసింది. ఫిబ్రవరి చివరి నాటికి అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. పరిమితులు లేకుండా ప్రీపెయిడ్ కార్డ్‌లు లేదా వ్యాలెట్లలో నిధులను విత్ డ్రా చేయడానికి బ్యాలెన్స్‌లను వాడుకోవడానికి ఇప్పటికే ఉన్న కస్టమర్లకు స్వేచ్ఛ ఉంటుందన్నారు. పేటీఎం యాప్ ఎప్పటిలాగే ఫిబ్రవరి 29 తర్వాత పని చేస్తూనే ఉంటుందని కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. RBI ఆదేశాలను ప్రతికూల పరిణామంగా బెర్న్స్టెయిన్లోని విశ్లేషకులు అభివర్ణించారు వ్యాపారంపై ఇప్పటికే భారీ నియంత్రణకు దారితీసిందని చెప్పారు.
ప్రతి సవాలుకి ఒక పరిష్కారం ఉంది
ప్రతి పేటీఎం యూజర్లకు శర్మ తన సందేశాన్ని అందించారు. పేటీఎం యూజర్లతో సోషల్ మీడియా వేదికగా సంప్రదించి అన్ని వివరాలను పంచుకున్నారు. ‘మీకు ఇష్టమైన యాప్’ బాగా పనిచేస్తోంది.. ఫిబ్రవరి 29 తర్వాత కూడా అలాగే కొనసాగుతుందని ఆయన చెప్పారు. RBI పేరు లేదా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై పరిమితులను పేర్కొనకుండా ‘ప్రతి సవాలు’కి ‘ఒక పరిష్కారం ఉంది’ అని శర్మ చెప్పారు. పూర్తి సమ్మతితో దేశానికి పేటీఎం సర్వీసులు అందించేందుకు తమ కంపెనీ కట్టుబడి ఉందని సీఈఓ అన్నారు. భారత మార్కెట్లో ఆన్లైన్(Online) పేమెంట్ రంగంపై కూడా అనేక విషయాలను ప్రస్తావించారు. ‘పేమెంట్ ఇన్నోవేషన్’లో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. ఆన్లైన్ పేమెంట్లు, ఆర్థిక సర్వీసుల్లో ‘PaytmKaro’ ‘అతిపెద్ద ఛాంపియన్’ అవుతుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ పోస్ట్‌ని ‘ఎక్స్’లో పిన్ చేశారు.
ప్రతి రుణదాతకు ఆందోళనలు ఉంటాయని, అందరి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. పోర్ట్‌ఫోలియోపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో అంచనా వేసి అందుకు అనుగుణంగా అందరి ప్రశ్నలకు సమాధానాలిస్తామని పేటీఎం సీఓఓ(Chief Operating Officer) భవేష్ గుప్తా తెలిపారు. ఆర్బీఐ ఆదేశాలతో ఫిన్‌టెక్ సంస్థపై రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల ప్రభావం పడింది.
Published 02 Feb 2024