‘వాలెంటైన్స్ డే’ కన్నా ముందే ఆపిల్ ఐఫోన్ 15పై భారీగా తగ్గింపు..
ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు.. డోంట్ మిస్..
Apple iPhone 15 Price : కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే మీకు సరైన సమయం.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డీల్‌ను ప్రకటించింది. ‘వాలెంటైన్స్ డే’ (Valentine’s Day)కి ముందుగానే కేవలం రూ.68,999 ధరకే ఐఫోన్ అందిస్తోంది. ఇప్పటికే అనేక ఆన్లైన్ విక్రయాలలో ఐఫోన్ 15 ధర భారీ తగ్గింపు పొందింది. ఇప్పుడు వాలెంటైన్స్ డేకి ముందు.. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ల ధరలను తగ్గించి ‘బిగ్ బచత్ డేస్(Big Bachat Days)’ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15 అసలు ధర రూ. 79,900 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ. 68,999కే అందుబాటులో ఉంది. మీకోసం ఐఫోన్ కొనుగోలు చేస్తున్నా లేదా ప్రేమికుల రోజున బహుమతి కోసం ప్లాన్ చేస్తున్నా సరే.. తక్కువ ధరలో ఐఫోన్‌ను పొందేందుకు ఇదే సరైన అవకాశం. ఇంతకీ, ఐఫోన్ 15 కొనుగోలుకు ఎంత ఖర్చవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ధర తగ్గింపు :
భారత మార్కెట్లో ఐఫోన్ 15 భారీ తగ్గింపు పొందింది. ఇప్పుడు ఐఫోన్ ధరలు రూ.70,000 లోపు అందుబాటులో ఉన్నాయి. ఒరిజినల్ రిటైల్ ధర నుంచి గణనీయమైన తగ్గింపుతో పొందవచ్చు. ఐఫోన్ 15 అసలు ధర రూ.79,990పై 8 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. వినియోగదారులు ఈ అద్భుతమైన డీల్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో పొందవచ్చు. ఈ విశేషమైన డీల్ ధర రూ.72,999 అంటే.. రూ.6,991 వరకు సేవింగ్ చేయవచ్చు. మీ EMI లావాదేవీలు, ఈఎంఐ యేతర లావాదేవీలు రెండింటికీ HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌పై రూ.4,000 తగ్గింపు అందిస్తుంది. ఐఫోన్ 15 కొనుగోలుపై Flipkart Axis బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంటే.. మొత్తంగా ఐఫోన్ 15 రూ.68,999కే సొంతం చేసుకోవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్లు :
ఆసక్తిగల వినియోగదారులు ఐఫోన్ 15పై మరింత తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.57,990 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ధర అనేది డివైజ్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. పాత డివైజ్ ట్రేడింగ్ చేయడం ఎంచుకున్న వారికి ఐఫోన్ 15 ధర మరింత తక్కువకు కొనుగోలు చేయొచ్చు.
ఐఫోన్ 15 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ A16 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా (XDR) డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 12MP 2x టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. ఆకర్షణీయమైన ఫొటోగ్రఫీని అందిస్తుంది. ఐ-ఆకారపు పంచ్ హోల్ డిస్ప్లేతో డైనమిక్ ఐలాండ్‌ను కూడా అందిస్తుంది. మీ ప్రస్తుత డివైజ్ అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నా లేదా సరైన వాలెంటైన్స్ డే బహుమతి కోసం వెతుకుతున్నా ఆపిల్ ఐఫోన్ 15 సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీ ప్రియమైనవారికి వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా తక్కువ ధరకే ఐఫోన్ 15 సిరీస్ అందించవచ్చు.
Published 04 Feb 2024