కేన్ విలియమ్సన్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీల మోత మోగించడంతో దక్షిణాఫ్రికా ఎదుట న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని(Huge Target) ఉంచబోతున్నది. తొలి ఇన్నింగ్స్(First Innings)లో 511 పరుగులు చేసిన కివీస్.. సౌతాఫ్రికాను 162 రన్స్ కే ఆలౌట్ చేసింది. ఫాలో ఆన్ లో పడిన సౌతాఫ్రికాను సెకండ్ ఇన్నింగ్స్ ను ఆడనివ్వకుండా తిరిగి న్యూజిలాండే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్ లో 118 స్కోరు చేసిన విలియమ్సన్, మరుసటి ఇన్నింగ్స్ లోనూ 109 పరుగులు చేశాడు. అటు ఫస్ట్ ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ(240) చేసిన రచిన్ రవీంద్ర ఈ ఇన్నింగ్స్ లో మాత్రం 12కే ఔటయ్యాడు.
హాఫ్ సెంచరీ లేని ఇన్నింగ్స్…
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో ఏ ఒక్క బ్యాటరూ గట్టిగా నిలబడలేదు. ప్రత్యర్థి బ్యాటర్లు సెంచరీల మోత మోగిస్తే సఫారీలు కనీసం హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. కీగన్ పీటర్సన్(45)దే హయ్యెస్ట్ స్కోరు. 349 పరుగుల భారీ ఆధిక్యం పొందినా న్యూజిలాండ్ మాత్రం సఫారీల్ని ఫాలో ఆన్ ఆడనివ్వకుండా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. దీంతో ఓవరాల్ గా ఇప్పటివరకు కివీస్.. 528 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో రెండు రోజులు ఆట మిగిలున్న దశలో న్యూజిలాండ్ విసిరే టార్గెట్ ను రీచ్ చేయడం సౌతాఫ్రికాకు కష్టమైన పనే.
Published 06 Feb 2024