ఆయనో మాజీ మంత్రి(Ex Minister). మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకునే హావాభావాలు(Expressions) ప్రదర్శిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. పదవి పోయిన తర్వాత కాస్త తగ్గినా.. లేటు వయసులోనూ తన ఘాటును మాత్రం తగ్గించడం లేదు. సంచలన రీతిలో కామెంట్లు చేసే ఆ సీనియర్ రాజకీయ నాయకుడే చామకూర మల్లారెడ్డి. 2014లో మల్కాజిగిరి నుంచి MPగా గెలిచి, తెలంగాణ నుంచి పార్లమెంటుకు వెళ్లిన ఏకైక లీడర్ గా నిలిచారు. ఆ తర్వాత 2016 జూన్ లో భారత్ రాష్ట్ర సమితి(BRS)లో చేరారు. 70 ఏళ్ల వయసు గల మల్లారెడ్డి గత ప్రభుత్వంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయన మీడియాతో చేసిన చిట్ చాట్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది.
పాలిటిక్స్ లేకుంటేనా…
కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులున్నట్లే మా కుటుంబంలోనూ మూడు పోస్టులు ఉండాలనుకున్నామని ఈ మాజీ మంత్రి అన్నారు. తన తనయుడు భద్రారెడ్డి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ ఆదేశిస్తే రంగంలోకి దూకడమేనని చిట్ చాట్ లో ప్రస్తావించారు. మాజీ మంత్రి జగ్గారెడ్డి తనపై విమర్శలు చేయడంపైనా మల్లారెడ్డి స్పందించారు. MP టికెట్ కోసమే రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి పొగుడుతున్నారని, రాష్ట్రంలో ఫోకస్ కావడానికే రెగ్యులర్ గా తన పేరు ఎత్తుతున్నారని గుర్తు చేశారు. పాలిటిక్స్ నుంచి బయటపడితే మాత్రం జీవితాన్ని ఎంజాయ్ చేస్తానని మల్లారెడ్డి అన్నారు.
ఉన్నది ఒకటే జిందగీ అన్నట్లుగా…
‘మనిషి జీవితమనేది ఒకటేసారి వస్తుంది.. దాన్ని ఎంజాయ్ చెయ్యాలే తప్ప మరో ఆలోచన ఉండకూడదు.. నాకు గోవా(Goa)లో హోటల్ ఉంది.. రాజకీయాల(Politics) నుంచి తప్పుకుంటే అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తా’.. అంటూ ఈ మాజీ మంత్రి తన అంతరంగాన్ని బయటపెట్టారు.
Published 09 Feb 2024