ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ వడ్డీ రేటు(Interest Rate) ఖరారైంది. ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును నిర్ణయిస్తూ EPFO… ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(CBT) సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరా(Financial Year)నికి గాను 8.25 శాతం వడ్డీ రేటును నిర్ణయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది 8.15 శాతంగా చెల్లించారు. ఇప్పుడు మరో 0.10 శాతం పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపి ప్రభుత్వం నుంచి ఆమోదం పొందాక వడ్డీ రేటును అధికారికంగా EPFO నోటిఫై చేస్తుంది.
ఖాతాల్లో జమ…
కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఆమోదం(Green Signal) లభించిన వెంటనే చందాదారుల ఖాతాల్లో వడ్డీ రేటు జమ అవుతుంది. ఈ వడ్డీ మొత్తాన్ని 6 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ లో PFపై వడ్డీరేటు 8.5 శాతంగా ఉండేది. కానీ అనూహ్యంగా 2021-22లో దాన్ని 8.1 శాతంగా నిర్ణయించడం సంచలనంగా మారింది. గత మూడేళ్లలో ఈసారి ప్రకటించిన వడ్డీ రేటే అత్యధికం కావడం విశేషం.
గత పదేళ్లలో పీఎఫ్ వడ్డీ రేట్లు ఇలా…
1. 2013-14 – 8.75 శాతం
2. 2014-15 – 8.75 శాతం
3. 2015-16 – 8.8 శాతం
4. 2016-17 – 8.65 శాతం
5. 2017-18 – 8.55 శాతం
6. 2018-19 – 8.65 శాతం
7. 2019-20 – 8.5 శాతం
8. 2020-21 – 8.5 శాతం
9. 2021-22 – 8.1 శాతం
10. 2022-23 – 8.15 శాతం
Published 10 Feb 2024