గత వారమే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన తర్వాత 42 శాతం కిరాణా స్టోర్లు పేటీఎం నుంచి వైదొలిగి ఇతర మొబైల్(Mobile) పేమెంట్ల యాప్‌లను ఉపయోగించడం ప్రారంభించాయని కిరాణా క్లబ్(Kirana Club) గురువారం నిర్వహించిన సర్వేలో తేలింది. మొత్తం 5 వేల మందిపై చేసిన సర్వే ప్రకారం.. దాదాపు 20 శాతం మంది ఇతర పేమెంట్ యాప్‌లను ఉపయోగించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆర్బీఐ ప్రకటన తర్వాత 68 శాతం భారతీయ కిరాణా స్టోర్లలో పేటీఎంపై నమ్మకం(Believeness) తగ్గిందని సర్వే పేర్కొంది. పేటీఎమ్‌కి సంబంధించి స్థానిక రిటైలర్లలో నెలకొన్న విశ్వాసాలపై సదరు సర్వే కొన్ని విషయాలను వెల్లడించింది.
పేటీఎంకు బదులుగా ఇతర యాప్స్ :
ఆర్బీఐ ఆంక్షల(Restrictions) తర్వాత 68 శాతం భారతీయ కిరాణా స్టోర్లలో పేటీఎంపై నమ్మకం తగ్గిందని సర్వే పేర్కొంది. కిరాణా క్లబ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అన్షుల్ గుప్తా మాట్లాడుతూ.. ‘రెగ్యులేటరీ అథారిటీ విధించిన నిషేధం కిరాణా స్టోర్లలో అంతరాయాన్ని కలిగిస్తోంది. ప్రత్యామ్నాయ పేమెంట్ యాప్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నందున పెద్దగా ఆందోళన చెందడం లేదు. సర్వే ప్రకారం, ఇతర పేమెంట్ల యాప్‌లను ఉపయోగించాలనుకుంటున్న 50 శాతం మంది రిటైలర్లు (PhonePe)ని ఎంచుకున్నారు. దీని తర్వాత Google Pay వైపు 30 శాతం, BharatPe యాప్‌ను 10 శాతం మంది రిటైలర్లు ఎంచుకున్నారని సర్వేలో తేలింది.
పేటీఎంలో ఇక డబ్బులు లోడ్ చేయలేరు :
ఫిబ్రవరి 29 తర్వాత ఏవైనా కస్టమర్ ఖాతాలు, వాలెట్(Wallet)లు, ఫాస్ట్‌ట్యాగ్(Fast Tag)లు, ఇతర టూల్స్‌లో డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను స్వీకరించడాన్ని నిలిపివేయాలని గత నెలలో పేటీఎంను RBI ఆదేశించింది. పేటీఎం నిర్వహించే 330 మిలియన్ వ్యాలెట్ ఖాతాలను కలిగిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)ని ఈ మేరకు RBI ఆదేశించింది. అప్పటివరకు కస్టమర్లు డబ్బును లోడ్ చేయలేరు. కానీ, పేటీఎం వ్యాలెట్, PPBL ఖాతా నుంచి డబ్బును తీసుకోవచ్చు.
ఎప్పుడైనా క్రెడిట్ అయ్యే ఛాన్స్ :
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు (PPBL)పై చర్య.. సమగ్ర సిస్టమ్ ఆడిట్ నివేదిక, బాహ్య ఆడిటర్ల సమ్మతి ధ్రువీకరణ నివేదికను అనుసరించిందని ఆర్బీఐ తెలిపింది. One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) PPBLలో 49 శాతం వాటాను కలిగి ఉంది. అయితే, ఏదైనా వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు లేదా రీఫండ్లు ఎప్పుడైనా కస్టమర్లకు తిరిగి క్రెడిట్ అయ్యే అవకాశం ఉందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.