2024-25 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్(Budget) రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి(Finance Minister) మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2,75,891 కోట్లతో బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా… మూలధన వ్యయం 29,669 కోట్లుగా కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లను వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం పంచాయతీరాజ్ నీటి పారుదల రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. పంచాయతీ రాజ్ శాఖకు అత్యధికంగా రూ.40,080 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో తెలియజేశారు.
శాఖల వారీగా కేటాయింపులు…
పంచాయతీరాజ్ – రూ.40,080 కోట్లు
నీటిపారుదల – రూ.28,024 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.21,874 కోట్లు
విద్యా రంగం – రూ.21,389 కోట్లు
వ్యవసాయం – రూ.19,746 కోట్లు
విద్యుత్తు సంస్థలు – రూ.16,825 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.13,013 కోట్లు
పురపాలక – రూ.11,692 కోట్లు
వైద్యరంగం – రూ.11,500 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.8,000 కోట్లు
గృహనిర్మాణం – రూ.7,740 కోట్లు
పరిశ్రమలు – రూ.2,543 కోట్లు
గృహజ్యోతి – రూ.2,418 కోట్లు
మైనారిటీ సంక్షేమం – రూ.2,262 కోట్లు
బీసీ గురుకుల భవనాలు – రూ.1,546 కోట్లు
SC, ST గురుకుల భవనాలు – రూ.1,250 కోట్లు
మూసీ ప్రాజెక్టు – రూ.1,000 కోట్లు
ఐటీ – రూ.774 కోట్లు
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ – రూ.500 కోట్లు
యూనివర్సిటీల్లో సదుపాయాలు – రూ.500 కోట్లు
Published 10 Feb 2024