తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న భారత్ తో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో నేడు ఆస్ట్రేలియా తలపడనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం(Full Domination) చూపుతున్న యువ టీమ్ఇండియా.. కప్పుకు మరో అడుగు దూరంలో నిలిచింది. గత నవంబరులో ముగిసిన సీనియర్ల వరల్డ్ కప్ లో ఇదే దేశానికి చెందిన టీమ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఇప్పుడా పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి యువ ప్లేయర్లలో కనిపిస్తున్నది. అండర్-19 వరల్డ్ కప్ లో భారత జట్టు ఆధిపత్యానికి తిరుగులేదని చెప్పాలి.
తొమ్మిదో ఫైనల్…
డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న టీమ్ఇండియా కుర్రాళ్లు.. ఈ టోర్నీలో తొమ్మిదో ఫైనల్(Nineth Final) కాగా ఆరో టైటిల్ కోసం రేపు ఫైనల్ ఆడబోతున్నారు. అటు ఆస్ట్రేలియా 14 ఏళ్ల క్రితం 2010లో మిచెల్ మార్ష్ ఆధ్వర్యంలో కప్పు గెలిచింది. ప్రస్తుత టోర్నీ జరుగుతున్న దక్షిణాఫ్రికా పిచ్ లు, అక్కడి వాతావరణం భారత కుర్రాళ్లకు కొత్త కాదు. 2012లో ఉన్ముక్త్ చంద్ ఆధ్వర్యంలో టౌన్స్ విల్లేలో… 2018లో మన్ జోత్ కల్రా నేతృత్వంలో మౌంట్ మాంగనూయిలో యువ భారత జట్లు జయకేతనం ఎగురవేశాయి. మరోవైపు సౌతాఫ్రికాలోని ప్రవాస భారతీయుల(NRI) మద్దతు మనకు భారీగానే ఉంటుంది. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో ఆరు మ్యాచ్ ల్లో భారత్ గెలవగా.. అందులో రెండు ఫైనల్స్ ఉన్నాయి.
ఓపెనర్లు మినహా…
సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్లో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా చివరకు టీమ్ఇండియాదే విజయమైంది. కెప్టెన్ ఉదయ్ సహరన్, సచిన్ ధాస్ ఐదో వికెట్ కు వరల్డ్ కప్ లో రికార్డు స్థాయి(Record Level) పార్ట్నర్ షిప్ క్రియేట్ చేయడంతో మన టీమ్ ఫైనల్లో ఎంటరైంది. బెనోని(Benoni) స్టేడియంలోని పిచ్ సీమ్ బౌలింగ్ కు స్వర్గధామంగా నిలవనుంది. ముందు బౌలింగ్ చేసిన జట్టు.. స్వింగ్ తో వికెట్లు రాబట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టోర్నీలో ఓపెనింగ్ జోడీ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ ల్లో 50 పార్ట్నర్ షిప్ నమోదు చేయలేదు. అన్ని వరల్డ్ కప్ ల్లోకెల్లా ఈ టోర్నీలోనే ఓపెనర్ల నుంచి సరైన భాగస్వామ్యం(Partnership) లేకుండా పోయింది.
Published 10 Feb 2024