ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా డిప్యుటీ కలెక్టర్లు(Deputy Collectors), తహసీల్దార్లు, MPDOలను భారీ సంఖ్యలో బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు స్థాన చలనం కల్పించింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్(CEC) ఆదేశాల మేరకు పలువురు ఎక్సైజ్ ఉన్నతాధికారుల్ని బదిలీ(Transfer) చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 మంది డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్(DPEO)లను ఆయా స్థానాల నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ ఆదేశాలు ఇచ్చారు.
బదిలీలు జరిగిన అధికారులు వీరే…
పేరు పాత స్థానం కొత్త స్థానం
ఎం.ఎ.రజాక్ మెదక్ నిర్మల్
ఎ.సత్యనారాయణ శంషాబాద్ జగిత్యాల
కె.అనిత సూర్యాపేట జనగామ
ఆర్.లక్ష్మానాయక్ వరంగల్(రూ) సూర్యాపేట
ఎస్. సైదులు మహబూబ్నగర్ యాదాద్రి భువనగిరి
ఎస్.ఉజ్వలారెడ్డి హైదరాబాద్-II సరూర్ నగర్
ఎస్.కృష్ణప్రియ జనగామ శంషాబాద్
ఎస్.కె.ఫయాజుద్దీన్ నాగర్ కర్నూల్ మేడ్చల్
కె.నవీన్ కుమార్ యాదాద్రి మల్కాజిగిరి
కె.విజయభాస్కర్ మేడ్చల్ వికారాబాద్
ఎస్.నవీన్ చంద్ర వికారాబాద్ సంగారెడ్డి
డి.గాయత్రి సంగారెడ్డి నాగర్ కర్నూల్
డి.అరుణ్ కుమార్ మల్కాజిగిరి గద్వాల
టి.రవీందర్ రావు సరూర్ నగర్ వనపర్తి
Published 12 Feb 2024