కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అమెరికాలో ఆహో ఓహో అంటూ ప్రచారం చేసుకున్నారని, కానీ ఆ ప్రాజెక్టు చూస్తే ఎలా ఉందో అర్థమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్(Time Square)తోపాటు డిస్కవరీ ఛానల్(Discovery) ఛానల్ లోనూ ఊకదంపుడు ప్రచారం నిర్వహించుకున్నారన్నారు. రూ.38,500 కోట్ల అంచనా(Estimation)తో మొదలైన పనులు రూ.1.47 లక్షల కోట్లకు చేరాయని, ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా వెచ్చించినా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. ఇసుక కదలడం వల్లే ప్రాజెక్టు కుంగిందని BRS ప్రభుత్వం చెప్పడం… దాన్నెవరూ చూడకుండా ఆనాడు భారీ బందోబస్తు పెట్టి అందర్నీ మోసం చేసిందని CM విమర్శించారు.
డాక్యుమెంట్ల కోసమే విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లే మాయమయ్యాయని, వాటి గురించి తేల్చేందుకే విజిలెన్స్ విచారణ వేశామని రేవంత్ గుర్తు చేశారు. ఆ నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటున్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరేముందు అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతోపాటు CM రేవంత్.. ప్రాజెక్టు తీరును వివరించారు.