అమెరికా ద్రవ్యోల్బణ లెక్కలు(US Inflation Data) వెలువడనున్న దృష్ట్యా మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు(National Stock Markets) లాభాల్లో మొదలై మధ్యాహ్నానికి అదే బాటలో కొనసాగుతున్నాయి. BSE సెన్సెక్స్ తోపాటు నిఫ్టీ సైతం లాభాల్లో కంటిన్యూ అవుతున్నాయి. BSE సెన్సెక్స్ 0.63%తో 440 పాయింట్ల లాభాల్లో 71,517.27 వద్ద ట్రేడవుతున్నది. అటు నిఫ్టీ(Nifty) సైతం 0.51%తో 100 పాయింట్లు లాభపడి 21,725.65 వద్ద కొనసాగుతున్నది.
రిటైల్ ద్రవ్యోల్బణం పరిస్థితి…
దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 5.10%తో మూడు నెలల కనిష్ఠ స్థాయికి దిగజారింది(Dropped). విదేశీ సంస్థాగత మదపర్లు(Foreign Institutional Investors) సోమవారం నాడు 127 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేస్తే… రూ.1712 కోట్ల విలువైన షేర్లను దేశీయ సంస్థాగత మదుపరులు(Domestic Institutional Investors) కొనుగోలు చేశారు. తయారీ రంగంలో ప్రతి సంవత్సరం ఆశావహ ఫలితాలు(Positive Indicating) కనపడటంతో ఇండస్ట్రియల్ ఔట్ పుట్ 2023
డిసెంబరు నాటికి 3.8% పెరిగింది.
లాభనష్టాల్లో కంపెనీలు..
NTPC, M&M, ICICI బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ITC లాభాల్లో కొనసాగితే… JSW స్టీల్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) మూడో త్రైమాసిక ఫలితాల్లో 5% మాత్రమే లాభాలు సాధించగా… కోల్ ఇండియా 3% లాభాలు పొందింది.