రుణ వడ్డీ రేట్ల(Interest Rates)లో మార్పులు చేస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. 2024 ఫిబ్రవరి నుంచి వడ్డీ రేట్లను అప్డేట్స్(Updates) చేశాయి. గతేడాది ఫిబ్రవరి 12 నుంచి MCLR(Marginal Cost Of Lending Rate)ను 5 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఓవర్ నైట్ రేట్ ప్రస్తుతం 8.10%గా ఉంటే.. ఒక నెల రేటు 8.15% నుంచి 8.20%కు… మూడు నెలల రేటు 8.25% నుంచి 8.30%కి సర్దుబాటు చేశాయి. 6 నెలల రేటును పరిశీలిస్తే స్వల్ప పెరుగుదల ఉంటుంది. అది 8.60% నుంచి 8.65%గా ఉంటుందని పలు బ్యాంకులు ప్రకటించాయి. ఇక సంవత్సరం రేటు ఇపుడున్న 8.80% నుంచి 8.85%కి… అదనంగా రెండేళ్ల కాలానికి 9.15% శాతానికి పెంచాయి. ఇక మూడేళ్ల కాలానికి పరిశీలిస్తే అది 9.25%గా ఉండనుంది. కెనరా బ్యాంక్ రెపో లింక్డ్ లెండింగ్ రేటు ఈ ఫిబ్రవరి 12 నుంచి 9.25%గా ఉంటుంది.
బ్యాంకుల వారీగా…
* ICICI బ్యాంకుకు సంబంధించి ఓవర్ నైట్ తోపాటు ఒక నెల MCLRను చూస్తే 8.40%గా అడ్జస్ట్ చేసింది. 3 నెలలతోపాటు ఆరు నెలలకు 8.45% నుంచి 8.60%కి… ఒక సంవత్సర కాల MCLR 8.65%కు మార్పులు చేసినట్లు తమ వెబ్ సైట్ లో తెలియజేసింది.
* పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)ని పరిశీలిస్తే ఓవర్ నైట్ రేటును 7.90%కు… ఒక నెల MCLR రేటును 7.90% నుంచి 8%నికి… మూడు, ఆరు నెలల కాలానికి 8.10% నుంచి 8.30%కి… ఒక ఏడాదికి 8.40%… మూడు సంవత్సరాల కాలానికి 8.70%గా మార్చినట్లు తెలిపింది.
* యెస్ బ్యాంక్(Yes Bank)ని పరిశీలిస్తే కొత్త రేట్లను ఈ సంవత్సరం జనవరి 1 నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఓవర్ నైట్ రేటును 9.2%కు… ఒక నెల MCLR రేటును 9.45%కి… మూడు నెలల కాలానికి 10%… ఆరు నెలలకు 10.25%… ఒక ఏడాదికి 10.50%గా ఉంది.
* బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)ని చూస్తే కొత్త రేట్లను ఈ సంవత్సరం జనవరి 1 నుంచే అమలు చేస్తున్నట్లు BOI స్పష్టం చేసింది. ఓవర్ నైట్, ఒక నెల రేట్లను 10 బేసిస్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల కాలానికి 8.40%… ఆరు నెలలకు నుంచి 8.60%కి… ఒక ఏడాదికి 8.80%గా అడ్జస్ట్ చేసింది.
Sl No. | MCLR Benchmark | MCLR In (%) |
1. | Overnight MCLR | 8.05% |
2. | 1 Month MCLR | 8.3% |
3. | 3 Month MCLR | 8.4% |
4. | 6 Month MCLR | 8.6% |
5. | One Year MCLR | 8.8% |