Android Phone : ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలామంది వెబ్సైట్లు ఓపెన్ చేస్తుంటారు. ఆయా సైట్లలో యాడ్ బ్యానర్లు తరచుగా కనిపిస్తుంటాయి. ఈ యాడ్స్ అధికంగా కనిపించడం ద్వారా వినియోగదారులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని యాడ్స్(Ads) పాప్-అప్ పేజీల ద్వారా కనిపిస్తాయి. మరికొన్నిసార్లు ఆటొమేటిక్గా వీడియో లేదా ఆడియో క్లిప్‌లు ప్లే అవుతుంటాయి. మితిమీరిన యానిమేషన్ల(Animation)తో మీ ఫోన్ డేటాను తినేస్తుంటాయి. తొందరగా డేటా అయిపోతుంది.
క్రోమ్ బ్రౌజర్లో యాడ్స్ బ్లాక్ చేయాలంటే? :
మీ Android ఫోన్లో (Google Chrome)ని డీఫాల్ట్ వెబ్ బ్రౌజర్‌గా ఉపయోగిస్తున్నారా? మీలో చాలామంది అలా చేస్తుంటారు. తద్వారా వెబ్సైట్లు ఫుల్ పేజీ ఇంటర్స్టీషియల్లను ఉపయోగిస్తే.. అన్ని యాడ్స్ ను క్రోమ్ బ్లాక్ చేస్తుందని గూగుల్ ప్రకటించింది. సైట్లు అనుకోకుండా సౌండ్లను ప్లే చేసినా లేదా ఫ్లాషింగ్-స్టైల్ యానిమేషన్ కలిగి ఉంటే క్రోమ్ బ్లాక్ చేసే యాడ్స్ కూడా ఎక్కువగా డిస్ప్లే అవుతుంటాయి. అయినప్పటికీ కొన్ని సైట్లు ఇప్పటికీ యాడ్స్ రూపొందించడానికి పాప్-అప్‌లను డిస్ప్లే చేస్తుంటాయి.
అయితే, క్రోమ్ యూజర్లు ఈ సమస్యను అధిగమించవచ్చు. క్రోమ్ ఓపెన్ చేసి మూడు చుక్కల మెను బటన్‌ను నొక్కడం ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లో యాడ్స్ బ్లాక్ చేయవచ్చు. Settings > Site Settings > Unwanted Ads ఆప్షన్‌కు వెళ్లి అనుచిత ప్రకటనలపై Toggle చేయండి. మీరు సైట్ సెట్టింగ్‌లకు తిరిగి వెళ్లి పాప్-అప్ (Pop-Up) రీడైరెక్ట్ ఆప్షన్ నొక్కండి. పాప్-అప్లు Pop-ups and redirects ఆప్షన్ వద్ద Toggle చేయండి.
క్రోమ్‌లో యాడ్స్ పాప్-అప్, రీడైరెక్షన్లను ఎలా బ్లాక్ చేయాలి? :
* క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్లో ఉన్న త్రీడాట్స్ మెనూపై నొక్కండి.
* సెట్టింగ్‌లపై నొక్కండి.
* సైట్ సెట్టింగ్ ఆప్షన్ కిందికి స్క్రోల్ చేసి దానిపై నొక్కండి.
* అనుచిత ప్రకటనలను ఎంచుకోండి.
* అనుచిత ప్రకటనలు టాగుల్ చేయాలి.
* సైట్ సెట్టింగ్ ఆప్షన్ ఎంచుకోండి.
* పాప్-అప్లు, రీడైరెక్షన్ ఆప్షన్ ఎంచుకోండి.
*పాప్-అప్, రీడైరెక్షన్ టోగుల్ చేయాలి.
DNSని మార్చడం ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లలో యాడ్స్ ఎలా బ్లాక్ చేయాలంటే? :
ఆండ్రాయిడ్‌లో యాడ్స్ బ్లాక్ చేసే బెస్ట్ మెథడ్స్‌లో ఒకటి. ఈ సింపుల్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Adblock DNS ఎలా ఉపయోగించాలి? :
* సెట్టింగ్స్ యాప్‌ను ఎనేబుల్ చేయండి.
* నెట్వర్క్ & ఇంటర్నెట్ ఆప్షన్ ఎంచుకోండి.
* ప్రైవేట్ DNS ఆప్షన్‌పై నొక్కండి.
* ప్రైవేట్ DNS ప్రొవైడర్ హోస్ట్ పేరుని ఎంచుకోండి.
* DNS ప్రొవైడర్ హోస్ట్ పేరును ఎంటర్ చేయాలి.
* dns.adguard.com అని ఎంటర్ చేయండి.
* ఆ తర్వాత Save ఆప్షన్ నొక్కండి.