Blood Sugar Levels : ప్రపంచాన్ని డయాబెటిస్(Diabetes) బెంబేలిత్తిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద అందరినీ ఈ వ్యాధి పట్టిపీడిస్తోంది. కొంతమందిలో చిన్నప్పటి నుంచే రాగా.. మరికొంతమందిలో ఒక వయస్సు వచ్చిన తర్వాత వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం.. జీవనశైలి, ఆహారపు అలవాట్లనే చెప్పాలి. వ్యాయామం లేకపోవడం, గంటల కొద్ది కూర్చోవడం, ఆకలి లేకున్నా అతిగా తినేయడం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. ఒకసారి డయాబెటిస్ వ్యాధి వచ్చిందంటే.. ఇక జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. దీనికి మందులు వాడినా ఉపశమనం తాత్కాలికమే. కేవలం డయాబెటిస్ కంట్రోల్ అవడమే తప్ప పూర్తిగా క్యూర్ కాదని గమనించాలి. ప్రస్తుత కాలంలో మీ షుగర్ లెవల్స్ ఎంత స్థాయిలో ఉన్నాయో తప్పకుండా చెక్ చేసుకోవాలి. ముందుగానే తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటే షుగర్‌ను గుర్తించి అదుపులోకి ఉంచుకోవచ్చు.
వయస్సుల వారీగా షుగర్ లెవల్స్ ఎంత ఉండాలంటే? :
వయస్సుల వారీగా(Age Wise) షుగర్ లెవల్స్ మారుతుంటాయి. ఒక్కో వయస్సు వారిలో షుగర్ లెవల్స్ ఒక్కోలా ఉంటాయి. శరీరంలోని రక్తంలో షుగర్ లెవల్స్ సాధారణ(Normal) స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే చాలా ప్రమాదకరం. అందుకే షుగర్ లెవల్స్ నార్మల్ ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. షుగర్ లెవల్స్ పెరిగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే, వయస్సుల వారీగా మీ వయస్సు బట్టి మీ బ్లడ్ షుగర్ లెవల్స్ ఎంత ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. ఏ వయస్సు వారిలో షుగర్ లెవల్స్ ఎంత ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డయాబెటిస్ నార్మల్ లెవల్స్ చార్ట్ మీకోసం అందిస్తున్నాం.
డయాబెటిస్ నార్మల్ లెవల్స్ చార్ట్ :
0 నుంచి 5 ఏళ్లలో చిన్నారుల్లో షుగర్ లెవల్స్ 110mg/dL నుంచి 200 mg/dL వరకు ఉండాలి.
6 నుంచి 12 ఏళ్ల వయస్సు పిల్లల్లో 100mg/dL నుంచి 180 mg/dL వరకు ఉండాలి
13 నుంచి 18 ఏళ్ల మధ్య వారిలో 90mg/dL నుంచి 150 mg/dL మధ్య ఉండాలి.
18 ఏళ్లు ఆపైబడిన వారిలో ఆహారం తీసుకున్నాక 140 mg/dL ఉండాలి. ఫాస్టింగ్ (ఖాళీ కడుపు)తో 99mg/dL ఉంటే అది నార్మల్ అని చెబుతారు.
డయాబెటిస్ రిస్క్ సాధారణంగా 40 ఏళ్ల తర్వాత అధికంగా ఉంటుంది. తినక ముందు 90mg/dL నుంచి 130mg/dL ఉండాలి. అదే ఆహారం తిన్నాక 140mg/dL నుంచి 150 mg/dL వరకు ఉండాలి.
బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయాలంటే? :
ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ అనేది సర్వసాధారణం.. బ్లడ్ షుగర్ లెవల్స్ ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే మంచిది కాదు. నేచురల్‌గా డయాబెటిస్ అదుపు(Control) చేసుకోవచ్చు. ముందుగా ప్రతిరోజూ ఉదయం సమయంలో ఎక్కువ దూరం నడవాలి. క్రమం తప్పకుండా గంట సేపు వ్యాయామం చేయాలి. అధిక కార్పొహైడ్రేట్ కలిగిన ఆహారాన్ని అసలు తినొద్దు. ఫైబర్ ఫుడ్(Fiber Food) మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి మందులు లేకుండా బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులోకి ఉంచుకోవచ్చు.