మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి, బుల్లితెర నటి(Television)గా మారి ఆ తర్వాత అందం, అభినయంతో హీరోయిన్ గా మారారు. సినిమా(Movies)ల్లో మంచి పొజిషన్ లో ఉన్న సమయంలోనే రాష్ట్రంలోనే ప్రధాన పార్టీ(Main Party) నుంచి ఆహ్వానం వచ్చింది. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలంటూ ఏకంగా ముఖ్యమంత్రే కోరడంతో.. ఆ హీరోయిన్ కాదనలేకపోయింది. అలా ఇచ్చిన మాట ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల్లో(General Elections)లో పోటీ చేశారామే. ఎన్నికల బరిలోకి దిగిన తొలిసారే MPగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. కానీ ఇప్పుడు మరోసారి ఎన్నికలు రాబోతున్న సమయంలో ఏకంగా ఆమె తన పదవికే రాజీనామా చేశారు. పాలిటిక్స్ కు పనికిరానంటూ రాం రాం చెప్పారు.
ఎవరీ నటీమణి…
బెంగాలీ సినీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్న హీరోయిన్ మిమి చక్రవర్తి(Mimi Chakraborty). మోడలింగ్ లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఈమె.. పశ్చిమ్ బెంగాల్ లోని జాదవ్ పూర్ నుంచి గత ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నికయ్యారు. CM మమతా బెనర్జీయే స్వయంగా అడగడంతో కాదనలేకపోయిన మిమి చక్రవర్తి.. అలా అలా పాలిటిక్స్ ను సాగుతూ పోనిచ్చారు. ఈ మధ్య కాలంలో ఆమె తీరుపై సొంత పార్టీ లీడర్లే విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. రాజకీయాలపై దృష్టిపెట్టడం లేదని, సినిమాలు చేసుకుంటూ తమను నిర్లక్ష్యం చేస్తున్నదంటూ హైకమాండ్ కు కంప్లయింట్ చేశారు. దీంతో విసిగి వేసారిపోయిన ఈ స్టార్ హీరోయిన్… నాకు పాలిటిక్స్ పడవంటూ గళం ఎత్తారు. MP పదవికి రాజీనామా చేసి మరీ ఆ లెటర్ ను మమతకు పంపించారు.
గతంలోనే చెప్పినా…
పదవిలో కొనసాగలేనంటూ 2022లోనే CMకు చెప్పినా ఆమె రిజెక్ట్ చేయడంతో మిమి ఆ ఆలోచన విరమించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ నిర్ణయాన్ని మార్చుకోలేకపోయారు. ఇప్పటికే తాను సభ్యురాలిగా ఉన్న రెండు పార్లమెంటు స్టాండింగ్ కమిటీలకు గుడ్ బై చెప్పిన ఈ కథానాయిక… తన MP సభ్యత్వాన్ని వదులుకున్న లెటర్ ను తృణమూల్ కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత సుదీప్ బందోపాధ్యాయకు పంపించారు. ‘బాపి బరీ జా’ చిత్రంతో మిమి చక్రవర్తి బెంగాల్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. ‘బెంగాలీ బాబు-ఇంగ్లిష్ మేమ్’, ‘గ్యాంగ్ స్టర్’, ‘ధనుంజయ్’తోపాటు ఎన్నో సినిమాల్లో ఆమె కీలక పాత్రల్లో నటించారు.