ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ, వన్ డౌన్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ 65 నాటౌట్ తో భారత జట్టు భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. మూడో రోజు ఆట ముగిసే(End) సమయానికి రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గిల్ పాటు మరోసారి నైట్ వాచ్ మన్(Night Watchman) గా వచ్చిన కుల్దీప్(3 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. 30 స్కోరుకే కెప్టెన్ రోహిత్ వికెట్ చేజార్చుకున్న భారత్ ను… మరో వికెట్ పడకుండా జైస్వాల్, గిల్ చూసుకున్నారు. జైస్వాల్(104; 133 బంతుల్లో 9×4, 5×6), గిల్(65 నాటౌట్; 120 బంతుల్లో 6×4, 2×6) ఉర్రూతలూగించారు.
ఇద్దరూ ఇద్దరే…
ఎడాపెడా ఫోర్లూ, సిక్సులు బాదుతూ స్కోరు బోర్డును జైస్వాల్, గిల్ ఇద్దరూ పరుగులు పెట్టించారు. రెండో వికెట్ కు ఈ యంగ్ ప్లేయర్స్ 155 రన్స్ పార్ట్నర్ షిప్ ఇచ్చారు. సెంచరీ పూర్తయిన తర్వాత యశస్వి రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోయాడు. అతడి స్థానంలో వచ్చిన రజత్ పటీదార్(0) డకౌట్ గా వెనుదిరిగాడు. మరో ఎనిమిది వికెట్లు చేతిలో ఉండగా ప్రస్తుతానికి టీమ్ఇండియా 322 పరుగుల లీడ్ లో ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న దశలో రేపు టీ టైమ్ వరకు భారత్ ఆడగలిగితే మరింత భారీగా టార్గెట్ ను ఇంగ్లండ్ ముందు ఉంచే అవకాశం ఉంది.