Airtel Data Plan : మీ ఫోన్లో డేటా అయిపోయిందా? ఇంటర్నెట్ డేటా తొందరగా అయిపోతుందా? తమ యూజర్ల కోసం ఎయిర్టెల్ సరికొత్త డేటా ప్యాక్ ప్రవేశపెట్టింది. హైస్పీడ్(High Speed) డేటాను పొందాలంటే ఇదే సరైన సమయం. భారత్‌లో ప్రముఖ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన భారతీ ఎయిర్టెల్ తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ కొత్త రూ.49 డేటా ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్యాక్ ఇప్పుడు ఒక రోజుకు 20GB (FUP)తో అన్లిమిటెడ్ డేటాను అందిస్తుంది. అదే వ్యాలిడిటీతో 6GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. రూ.49 డేటా ప్యాక్ రీఛార్జ్ ద్వారా ఆన్లైన్ కంటెంట్‌ను చూడవచ్చు. పెద్ద ఫైల్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తక్కువ వ్యవధిలో బల్క్ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఇదే బెస్ట్ డేటా ప్లాన్ అని చెప్పవచ్చు.
రిలయన్స్ జియో రూ. 61 డేటా ప్లాన్ :
మరోవైపు.. రిలయన్స్ జియో కూడా రోజుకి 6GB డేటాను రూ.61కు అందిస్తోంది. అదేవిధంగా ఎయిర్టెల్ కూడా ఇలాంటి ప్రయోజనాలతోనే రూ.99 డేటా ప్యాక్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్యాక్ 2 రోజుల పాటు రోజుకు 20GB (FUP)తో అన్లిమిటెడ్ డేటాను అందిస్తుంది. ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారులు ఈ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఓటీటీ ప్రయోజనాలు కూడా :
ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు అన్లిమిటెడ్ 5G డేటా, Airtel Xstream Play, Apollo 24/7 Circle, Disney+ Hotstar మొబైల్ సబ్స్క్రిప్షన్ వంటి మరిన్ని విలువ ఆధారిత సేవలు, మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.49, రూ.99 డేటా ప్యాకులను ఎయిర్టెల్ వెబ్సైట్, ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లేదా సమీపంలోని ఏదైనా ఎయిర్టెల్ స్టోర్ లేదా రిటైలర్ను సందర్శించి రీఛార్జ్ చేసుకోవచ్చు.