బాహుబలి స్టార్ అనుష్క శెట్టి, ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మిడిల్ ఏజ్ మహిళకు, ఒక యువకుడికి మధ్య లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు. ఇందులో అనుష్క చెఫ్‌గా కనిపించగా.. నవీన్ స్టాండప్ కమెడియన్‌గా వినోదం పంచనున్నాడు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ సీన్లు హిలేరియస్‌గా ఉండనున్నాయని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఆల్రెడీ విడుదలైన లవ్ బ్రేకప్ ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. కాగా.. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు మేకర్స్. ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఈ రోజు (సోమవారం) ప్రకటించారు.
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం ఆగస్టు 4న మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడిస్తూ.. సోషల్ మీడియాలో కొత్త పోస్టర్ షేర్ చేశారు. ఇక యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో మురళీ శర్మ, జయసుధ, తులసి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి పాన్-సౌత్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. ఇక ఈ మూవీ తర్వాత అనుష్క మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు. అలాగే నవీన్ పొలిశెట్టి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పైనా క్లారిటీ రావాల్సి ఉంది.