టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS)… భారత దిగ్గజ ఐటీ కంపెనీగా పేరుపొందిన సంస్థ. సరికొత్త విధానాలతో అగ్రగామిగా దూసుకెళ్తున్న టీసీఎస్.. ఈ మధ్యకాలంలో వర్క్ ఫ్రం హోమ్ సిస్టమ్ కు స్వస్తి పలికింది. ఇక ఉద్యోగులందరూ ఆఫీసులకు రావాల్సిందేనని డెడ్ లైన్ విధించింది. వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ వల్ల కలిగే నష్టాల గురించి ఆ సంస్థ CEO పెదవి విప్పారు. ఇది కంపెనీకి, అటు ఉద్యోగులకూ మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
సీనియర్ల ఎక్స్ పీరియన్సే…
ఇంటి నుంచే పని విధానం(Work From Home) లేదా హైబ్రిడ్ మోడల్ వల్ల ఉద్యోగులకు, కంపెనీలకు మంచిది కాదని TCS(Tata Consultancy Service) సీఈవో కె.కృతివాసన్ అన్నారు. ఉద్యోగుల్ని ఆఫీసులకు పిలిపించుకోవడంపై స్పందించిన ఆయన.. వర్క్ ఫ్రం హోమ్ తో పని నేర్చుకునే విధానం(Learning Experiences) లేకుండా పోతున్నదన్నారు. సీనియర్ కొలీగ్స్ నుంచి స్వీయ అనుభవాలు పంచుకోవడమనేది రిమోట్ సిస్టమ్ వల్ల సాధ్యం కాదని కృతివాసన్ గుర్తు చేశారు.
వర్చువల్, ఆన్ లైన్ తో ప్రమాదం కూడా…
వర్చువల్(Virtual) మీటింగ్స్, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ సంసృతి మంచిది కాదన్నది TCS విధానమన్న కృతివాసన్… టీమ్ వర్క్ తోపాటు ఫెలోషిప్ కు ప్రాధాన్యమిచ్చే తమ కంపెనీకి అది సరిపడదని అన్నారు. ‘ట్రెడిషనల్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటేనే ఎన్నో నేర్చుకోగలుగుతాం.. సీనియర్లను దగ్గర్నుంచి చూడటం ద్వారా వర్క్ స్టైల్ మరింత డెవలప్ అవుతుంది.. మా క్లయింట్లు కూడా వర్క్ ఫ్రం హోమ్ కు ఇష్టపడట్లేదు.. ఇంట్లో నుంచి పనిచేసే ఉద్యోగులు సైబర్ అటాక్స్ బారిన పడితే తిరిగి కోలుకోవడం కష్టమవుతుంది.. చివరకు అది అందరిపై ప్రభావం చూపుతుంది’.. అన్నది కృతివాసన్ అభిప్రాయం.