WhatsApp Web Secret Codes : వాట్సాప్ యూజర్లకు అదిరే న్యూస్.. వాట్సాప్ వెబ్ వెర్షన్లో కొత్త ఫీచర్(Latest Feature) రాబోతోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్ అందించేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెబ్ వెర్షన్(Web Version) కోసం కొత్త ఫీచర్ పనిచేస్తోందని నివేదిక తెలిపింది. యూజర్లను సీక్రెట్ కోడ్‌తో నిర్దిష్ట చాట్లను లాక్ చేయొచ్చు.. ఎవరికి కనిపించకుండా హైడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికే iOS, Android యూజర్ల వాట్సాప్‌లో అందుబాటులో ఉంది. లేటెస్టుగా వాట్సాప్ వెబ్ వెర్షన్లో రాబోయే ఈ కొత్త సీక్రెట్ ఫీచర్ యూజర్ల ప్రైవసీని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
చాట్.. లాక్ లేదా హైడ్ చేయొచ్చు :
వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే వెబ్సైట్ WABetaInfo ప్రకారం.. సీక్రెట్ కోడ్లతో కూడిన చాట్ లాక్ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. అతి త్వరలో వాట్సాప్ వెబ్‌లో రిలీజ్ చేయనుంది. ప్రైమరీ చాట్ జాబితా నుంచి కొన్ని చాట్లను లాక్ చేయడానికి లేదా హైడ్ చేయడానికి సీక్రెట్ కోడ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. హైడ్ చేసిన చాట్లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు ఈ సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌ల్లో సపోర్టు :
షేర్ చేసిన కంప్యూటర్ లేదా డివైజ్‌లో అనధికారిక యాక్సెస్(Access) నుంచి వినియోగదారుల చాట్లను రక్షించడమే ఈ ఫీచర్ లక్ష్యమని నివేదిక వెల్లడించింది. iOS, Android యూజర్లకు వాట్సాప్‌లో ఇప్పటికే ఉన్న చాట్ లాక్ ఫీచర్ కాకుండా, బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా అవసరం. సీక్రెట్ కోడ్ ఫీచర్ వాట్సాప్ వెబ్‌కు సపోర్టు ఇచ్చే ఏ డివైజ్‌లోనైనా పని చేస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను డిసేబుల్(Disable) చేసి దానికి బదులుగా బయోమెట్రిక్ చాట్ లాక్ ఫీచర్‌ను ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది.