ఒక సిరీస్ లో ఒకట్రెండు మ్యాచ్ ల్లో నిలకడగా ఆడితే చాలనుకుంటారు. ఆ మ్యాచ్ ల్లో సెంచరీలు చేసినా మిగతా మ్యాచ్ ల్లో ఆ కంటిన్యూటినీ నిలబెట్టుకోలేకపోతారు. కానీ ఒకే సిరీస్(One Series) లో రెండు డబుల్ సెంచరీలతో భారీగా పరుగులు సాధిస్తే.. ఆ ఘనతను ఇప్పుడు యశస్వి జైస్వాల్ అందుకున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల్లో భాగంగా ప్రస్తుతం రెండో టెస్టు రెండో రోజు ఆటలో.. ఈ కుర్ర ప్లేయర్ 600 పరుగుల మార్క్ ను చేరుకున్నాడు. ఈ సిరీస్ లో ఇప్పటిదాకా 618 రన్స్ చేసి.. ఒకే సిరీస్ లో 600 పరుగులు చేసిన ఐదో బ్యాటర్ గా నిలిచాడు. ఇతడి కంటే ముందు దిలీప్ సర్దేశాయ్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లి ఉన్నారు.
రెండు ‘డబుల్’లు
హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లో 80, 15 స్కోర్లు చేసిన జైస్వాల్… విశాఖ రెండో టెస్టులో డబుల్ సెంచరీ(209)తోపాటు సెకండ్ ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 10 పరుగులకే ఔటైనా… రెండో ఇన్నింగ్స్ లో మాత్రం మళ్లీ డబుల్ సెంచరీ(214) మార్క్ అందుకున్నాడు. ఇలా వరుస(Continue)గా రెండు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన అతడు… మూడో టెస్టు వరకు 545 రన్స్ తో రెండు జట్లలో టాపర్ గా ఉన్నాడు. నాలుగో టెస్టు రెండో రోజు సైతం క్రీజులో పాతుకుపోయిన ఈ చిన్నోడు.. 600 రన్స్ మైలురాయిని దాటాడు.
నిలకడగా ఆడినా…
302/7తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. 353 పరుగులకు ఆలౌట్ అయింది. జో రూట్ 122 రన్స్ తో నాటౌట్ గా మిగిలాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్ రోహిత్ శర్మ(2) వైఫల్యం మరోసారి ఇబ్బందికరంగా మారింది. జైస్వాల్ తో మంచి పార్ట్నర్ షిప్ నమోదు చేస్తున్న టైమ్ లో శుభ్ మన్ గిల్(38) ఔటయ్యాడు. ఆ తర్వాత రజత్ పటీదార్(17), రవీంద్ర జడేజా(12) వెంటవెంటనే వికెట్లు ఇచ్చుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్ తో బాగా ఆడుతున్న జైస్వాల్(73) కూడా వెనుదిరగక తప్పలేదు. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.