అప్పటిదాకా టపటపా వికెట్లు పడ్డ పిచ్ కేవలం బౌలింగ్ కే అనుకూలం కాదని, బాగా ఆడితే బ్యాటింగ్ కూడా చేయవచ్చని నిరూపిస్తున్నారు భారత ఓపెనర్లు రోహిత్, యశస్వి. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను 145 పరుగులకే కట్టడి(All Out) చేసిన టీమ్ఇండియా.. బ్యాటింగ్ ప్రారంభించి లక్ష్యం దిశగా సాగిపోతున్నది. దీంతో ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత విజయావకాశాలు ఇప్పటివరకైతే బాగానే కనపడుతున్నాయి. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ హిట్టింగ్ కు దిగడంతో క్రమంగా లక్ష్యం తగ్గుతూ పోతోంది.
ధనాధన్ బ్యాటింగ్…
మూడోరోజు ఇంగ్లండ్ 145కే ఆలౌట్ కావడంతో నాలుగో రోజు(Fourth Day)న పిచ్ ఎలా మారుతుందోనన్న ఆలోచన కావొచ్చేమో. ఇంగ్లండ్ ఆలౌటైన తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ కు.. ఓపెనర్లు శుభారంభం అందించారు. రోహిత్(24 నాటౌట్), జైస్వాల్(16 నాటౌట్) తొలి ఓవర్ నుంచే స్పీడ్ గా రన్స్ తీస్తున్నారు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. మరో 152 పరుగులు చేస్తే చాలు… విజయం భారత్ సొంతమవుతుంది.
ఆధిక్యంతో కలిపి…
అంతకుముందు ఇంగ్లండ్.. క్రాలీ(60), బెయిర్ స్టో(30) మాత్రమే రాణించి మిగతావాళ్లంతా చేతులెత్తేయడంతో 145కే చాప చుట్టేసింది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యం కలుపుకొని భారత్ కు 192 పరుగుల లక్ష్యాన్ని విధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 353 స్కోరు చేస్తే, భారత్ 307కు ఆలౌట్ అయింది.