అతను ఇప్పటిదాకా ఆడింది 20 టెస్టులైతే.. సగటు(Average) కేవలం 30.58. మామూలు ఆటగాళ్లకు ఇది మంచి యావరేజే. కానీ స్టార్ ప్లేయర్లకు ఇది సాధారణ విషయం. భావి భారత క్రికెటర్ గా ముద్రపడి వన్డేలు, టీ20ల్లో బాగానే రాణిస్తూ వరుసగా అవకాశాలు(Chances) దక్కించుకున్నా టెస్టు(Test)ల్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడతను. ఇక ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నట్లు ముళ్లకిరీటం మాదిరిగా మారిన సిరీస్ లో ఎట్టకేలకు తన టాలెంట్ చూపించాడు. 192 పరుగుల లక్ష్యంలో 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ప్రమాదపుటంచుల్లో నిలిచిన జట్టును.. గెలుపు తీరాలకు చేర్చాడు. అలా ఆ ఒక్క ఇన్నింగ్స్ తోనే తన స్థానాన్ని పదిలం చేసుకున్న కుర్ర క్రికెటరే.. శుభ్ మన్ గిల్.
మూడో ప్లేస్ లో…
వరల్డ్ క్రికెట్ బ్యాటింగ్ లో మూడో నంబరుకు విశేష ప్రాధాన్యం(Most Priority) ఉంటుంది. ఆడితేనే ఆ ప్లేస్ కంటిన్యూ అవుతుంది.. ఆడకపోతే మాత్రం ఏకంగా టీమ్ నుంచే వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాంటి వన్ డౌన్ లో వచ్చి ఎన్నో మ్యాచ్ ల్లో గోడలా నిలబడి భారత్ ను కాపాడిన వ్యక్తి రాహుల్ ద్రవిడ్. అలాంటి ద్రవిడే ప్రస్తుతం టీమ్ కోచ్ గా ఉన్నాడు. గతంలో ఇదే వన్ డౌన్ లో వచ్చిన ఛటేశ్వర్ పుజారా.. చాలా మ్యాచ్ ల్లో ఫెయిలవడంతో ఆ స్థానాన్ని కేఎల్ రాహుల్ తో భర్తీ చేస్తున్నారు. కానీ గాయంతో రాహుల్ తప్పుకోవడంతో ఫస్ట్ డౌన్ లో ఆడే ఆటగాడే లేకుండా పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే గిల్ కు ఆ ప్లేస్ దక్కింది.
ఈ సిరీస్ లో…
23, 0.. 34, 104.. 0, 91.. 38, 52*. ఇవీ.. ఈ సిరీస్ లో గిల్ సాధించిన స్కోర్లు. గత నాలుగు టెస్టుల్లో 342 పరుగులు తీసిన అతడు 48.85 యావరేజ్ తో ఉన్నాడు. రెండు జట్లలో గిల్ కన్నా ముందు జైస్వాల్ మాత్రమే ముందున్నాడు. ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రోక్ మేకర్ గా పేరుపొందిన గిల్.. చాలాకాలంగా తన రిథమ్ కోల్పోతున్నాడు. స్ట్రైక్ రొటేట్(Strike Rotate) చేయడంలో విఫలం కావడం వల్లే శుభ్ మన్ ప్లేస్ ప్రమాదంలో పడింది. కానీ విశాఖలో అతడు చేసిన సెంచరీ మళ్లీ పాత గిల్ ను గుర్తుకు తేవడంతోపాటు అతణ్ని నిలబెట్టిన ఇన్నింగ్స్ గా మారింది. లెగ్ స్టంప్ పై పడ్డ బంతుల్ని బ్యాక్ ఫుట్ పై ఆడటమే కష్టంగా మారిన గిల్ ను.. మార్క్ వుడ్ అదే అదునుగా బాల్స్ వేసి ఔట్ చేశాడు.
ముందుగా ప్రాక్టీస్ తోనే…
రాజ్ కోట్ లో రెండో రోజు మ్యాచ్ కు ముందు అతడు విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు. దాని ఫలితంగానే మూడో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో 91 రన్స్ తీశాడు. రాంచీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 38తో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అనూహ్యంగా ఎల్బీగా అవుటయ్యాడు. అలా ఎల్బీల నుంచి తప్పించుకునేందుకే రెండో ఇన్నింగ్స్ లో అడుగు ముందుకేసి(Step Out) సింగిల్స్ తీశాడు. అలా మ్యాచ్ నాలుగో రోజున 31 సార్లు క్రీజు బయటకు వచ్చి బాల్ ను ఆడాడు. ముఖ్యంగా బషీర్ బౌలింగ్ లో 50 బాల్స్ ఆడితే 27 సార్లు స్టెప్ ఔట్ వేశాడు. ఇదంతా తాను చేసిన ప్రాక్టీస్ ఫలితమేనని తర్వాత గిల్ చెప్పాడు. నాలుగో టెస్టులో మొత్తం 122 బాల్స్ ఆడితే.. అందులో 120వ బాల్ వరకు బౌండరీ కొట్టలేదు. 120 బాల్ ను బాదితే అది సిక్స్ గా వెళ్లింది. 122వ బాల్ కూడా సిక్స్ గా బౌండరీ లైన్ దాటడంతో గిల్ హాఫ్ సెంచరీ, భారత్ విజయం పూర్తయ్యాయి.