ట్రాన్స్ ఫర్స్ కోసం ఎదురుచూస్తున్న మోడల్ స్కూల్ టీచర్ల నిరీక్షణకు పదేళ్ల తర్వాత తెరపడింది. జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అత్యధిక సంఖ్యలో ఇంకో బడి మొహమే చూడని వీరంతా… ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 194 స్కూళ్లు ఉండగా… అందులో ప్రిన్సిపల్స్, పీజీటీ(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్), టీజీటీ(ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్) మొత్తం 3,000 మందికి పైగా పనిచేస్తున్నారు. ప్రిన్సిపల్స్ ను రాష్ట్రం యూనిట్ గా.. PGT, TGTలను జోన్ యూనిట్ గా పరిగణలోకి తీసుకుని ట్రాన్స్ ఫర్స్ చేస్తారు.
మొత్తానికి ఉద్యోగంలో చేరిన దశాబ్దం తర్వాత తొలిసారిగా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 5న మొదలయ్యే ట్రాన్స్ ఫర్స్ ప్రక్రియ… 22 నాటికి పూర్తవుతుంది. మోడల్ స్కూళ్లల్లో ఫస్ట్ ఫేజ్ టీచర్లు 2013లో రిక్రూట్ కాగా.. సెకండ్ ఫేజ్ కు సంబంధించి 2014 సెప్టెంబరులో జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. బదిలీకి అప్లై చేసుకోవాలంటే నిబంధనల ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న స్కూలులో రెండేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. ప్రిన్సిపల్స్ గరిష్ఠంగా ఐదేళ్లు.. మిగిలిన వారు ఎనిమిదేళ్లు ఒకే చోట పనిచేస్తూ ఉంటే వారిని తప్పక మార్చాలన్నది రూల్.