పీఎం సూర్య ఘర్(PM Surya Ghar) ముఫ్త్ బిజిలీ యోజన(Muft Bijli Yojana) పథకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూఫ్ టాప్ సోలార్ పవర్ స్కీమ్ కింద నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్(Union Cabinet) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి నివాసాలకు 300 యూనిట్ల విద్యుత్తును అందిస్తారు. ఈ నెల 13న ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇందుకోసం వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలా ఇవ్వబోతున్నారంటే…
ఈ స్కీమ్ కింద కోటి గృహాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా పీఎం సూర్య ఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన ప్రారంభించినట్టు ప్రధాని నరేంద్ర మోడీ ఇంతకుముందే ప్రకటించారు. రూ.76 వేల కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా కోటి గృహాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా తక్కువ విద్యుత్ బిల్లులు, ప్రజలకు ఉపాధి కల్పనకు సాయం అందిస్తుంది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్ టాప్ సోలార్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.