అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం BRS మధ్య సవాళ్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నాతోపాటు మల్కాజిగిరి MPకి పోటీ చెయ్… ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిరా.. చూసుకుందాం… ఇదీ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్. అంతకుముందు రేవంత్ కూడా చేవెళ్ల సభా వేదిక నుంచి గట్టి సవాల్ నే విసిరారు. రాష్ట్రంలో ఒక్క MP సీటు గెలిచి చూపించండి అంటూ KCR, KTRకు చురకంటించారు. దీనికి ప్రతిగానే మల్కాజిగిరి ఎంపీకి పోటీపై KTR రెస్పాండ్ అయ్యారు.
అయితే ఇప్పుడు కేటీఆర్ కు సైతం మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ‘నేను సిరిసిల్లకు వచ్చి పోటీ చేస్తా… ముందు MLAలుగా ఇద్దరం రాజీనామాలు చేద్దాం… సిరిసిల్లలో నాపై కేటీఆర్ గెలిస్తే రాజకీయాల(Politics) నుంచి తప్పుకుంటా.. కేటీఆర్ ఓడిపోతే BRS మూసివేయాలి.. ప్రతిపక్షంలో ఉన్నా 58 వేల ఓట్లతో గెలిచా.. కేటీఆర్ 30 వేలతో గెలిచారు.. ఈ దెబ్బతో ఆ పార్టీని క్లోజ్ చేస్తేనే.. ఇక ఆ పార్టీ ఉండదు.. అందుకే KTR.. ఛాలెంజ్ బంద్ చేసి అమెరికాకో, దుబాయికో పోయి మంచిగా ఎంజాయ్ చేసెయ్’ అంటూ కోమటిరెడ్డి మాట్లాడారు.