ఇప్పటికే రెండు పరాజయాలతో పాయింట్ల(Points) టేబుల్(Table)లో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ జెయింట్స్ కు.. మూడో మ్యాచ్ లోనూ పరాభవం తప్పలేదు. మహిళల IPLలో భాగంగా బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో ఆ టీమ్.. యూపీ వారియర్స్ చేతిలో ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్.. 5 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసింది. స్వల్ప టార్గెటే కావడంతో యూపీ పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 143 రన్స్ చేసి 6 వికెట్ల తేడాతో యూపీ గెలుపొందింది.
అంతా తక్కువ స్కోర్లకే…
గుజరాత్ జట్టులో అందరూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ఫోబి లిచ్ ఫీల్డ్(35)దే హయ్యెస్ట్ స్కోరు. లారా వల్వార్డ్త్(28), కెప్టెన్ బెత్ మూనీ(16) , హర్లీన్ డియోల్(18), ఆష్లే గార్నర్(30) ఆ మాత్రమైనా స్కోర్లు చేశారు.
హారిస్ విజృంభణ…
యూపీ బ్యాటింగ్ లో గ్రేస్ హారిస్ ఆటే హైలెట్. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ(50) కంప్లీట్ చేసుకుంది. కెప్టెన్ అలిసా హీలీ(33), కిరణ్ నవ్ గిరె(12), చమరి ఆటపట్టు(17), శ్వేత సెహ్రావత్(2) తొందరగానే అవుటైనా.. హారిస్, దీప్తి శర్మ లక్ష్యాన్ని ఛేదించారు. 90 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా మరో వికెట్ పడకుండా టార్గెట్ రీచ్ అయ్యారు.
ఈ ఓటమితో ఆడిన మూడింటికి మూడు మ్యాచ్ ల్లో ఓటమి పాలై గుజరాత్ జెయింట్స్ పాయింట్లేమీ లేకుండా లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. అటు యూపీ మాత్రం నాలుగు మ్యాచ్ లకు గాను రెండింట్లో ఓడి మరో రెండింట్లో విజయాలతో నాలుగు పాయింట్లతో ఉంది.